Andhra Womens: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. కొత్త నియామకాలకు లైన్ క్లియర్.. అర్హతలు ఇవే..
ఏపీలోని డ్వాక్రా సంఘాల విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-నారీలను నియమించనుంది. ప్రతీ డ్వాక్రా సంఘంలో ఒక మహిళను ఈ-నారీగా ప్రకటించనుంది. వీరికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అర్ధిక సహాయం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు..

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 2 వేల డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో రూ.15 వేలు జమ చేసింది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రివాల్వింగ్ ఫండ్ క్రింద వీటిని అందించింది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల బ్యాంక్ అకౌంట్లలో ఇవి జమయ్యాయి. ఇక తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. ఇక ఇంటి నుంచే లోన్‌కు సంబంధించిన వాయిదాలను చెక్ చేసుకోవడం, సంఘంలోని సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు మన డబ్బులు-మన లెక్కలు యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్‌ను అందరూ వాడేలా చేసేందుకు తాజాగా కూటమి సర్కార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ -నారీ కాన్సెప్ట్
ప్రభుత్వం తెచ్చిన యాప్‌ను మహిళలందరూ వాడేలా అవగాహన కల్పించేందుకు ఈ–నారీ అనే కొత్త కాన్సెఫ్ట్‌ను తీసుకొచ్చింది. ప్రతీ డ్వాక్రా సంఘంలో ఓ మహిళను ఎంపిక చేస వారిని ఈ-నారీగా నియమించనుంది. వీళ్లు తమ సంఘంలోని ప్రతీ మహిళకు యాప్ ఎలా వాడాలనే దానిపై ట్రైనింగ్ కల్పించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం, యాప్‌ను ఉపయోగించడం తెలియని మహిళలందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సంఘంలో యాక్టివ్‌గా ఉండే మహిళతో పాటు ఈ-నారీ నియామకానికి పలు నిబంధనలు విడుదల చేసింది. వీరికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆర్ధిక సాయం కూడా అందించనున్నారు.
అర్హతలు ఏంటంటే..
–18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి
–స్మార్ట్‌ఫోన్ వాడటం తెలిసి ఉండాలి
-కనీసం పదో తరగతి చదివి ఉండాలి
–ఆండ్రాయిడ్ ఫోన్‌పై అవగాహన ఉండాలి
–డ్వాక్రా సంఘాల బుక్‌ల నిర్వహణ తెలిసి ఉండాలి
