AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో ఫ్యాట్‌ లాస్‌ జర్ని స్టార్ట్ చేస్తున్నారా?.. ఈ ఒక్క డ్రింక్‌ మీ డైట్‌లో ఉంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు డైట్‌లు ఫాలో అవ్వడం, జిమ్‌కు వెళ్లడం చేస్తుంటారు. కానీ వాళ్లు ఎంత ప్రయత్నించినా బరువును పూర్తిగా తగ్గించుకోలేరు. అయితే మన పూర్వికుల కాలం నుంచి ఆచరణలో ఉన్న ఒక చిట్కా మాత్రం ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అదే దాల్చిన చెక్కా నీరు. 

2026లో ఫ్యాట్‌ లాస్‌ జర్ని స్టార్ట్ చేస్తున్నారా?.. ఈ ఒక్క డ్రింక్‌ మీ డైట్‌లో ఉంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!
Weight Loss Journey
Anand T
|

Updated on: Dec 28, 2025 | 8:06 PM

Share

దాల్చినచెక్క నీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచే లక్షణాల కలిగి ఉంటాయి. ఈ నీటిని రోజూ తాగడం వ్వారా జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 2026లో ఫ్యాట్‌లాస్ జర్నీని స్టార్ట్ చేసే వారికి ఈ పానియం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీకు మరో గుడ్‌న్యూస్ ఏమిటంటే దీనికి మీరు వందలు, వేల రూపాయలు ఖర్చు చేయాల్సి పనిలేదు. చాలా తక్కువ ఖర్చుతో దీనిని తయారు చేసుకోవచ్చు.

దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానియం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే మీకు అతిగా ఆకలి వేయకుండా ఎక్కువ సేపు కడుపు నిండి అనుభవాన్ని ఇస్తుంది. దీని ద్వారా మీరు తక్కువ తినడానికి దోహదపడుతుంది. మీ రోజు వారి ఆహారంతో పాటు మార్నింగ్‌ ఈ డ్రింక్‌ను తీసుకుంటే దాని ప్రయోజనాలను పొందచ్చవు.

రోగనిరోధక శక్తి: దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరం ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడి శరీరంలోని విషాన్ని బయటకు పంపుతాయి. రోజూ మార్నింగ్‌ మీరు ఈ నీటిని తాగడం ద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరగుతుంది. ఇది మీ శరీరానికి లోపల నుంచి శక్తిని అందిస్తుంది. అలాగే కాలానుగన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

గట్‌ హెల్త్‌ : మీ గట్‌ హెల్త్‌ను కాపాడడంతో కూడా దాల్చినచెక్క నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సున్నితంగా ప్రేరేపించి మనం తిన్న ఆహారాన్ని సమర్ధవంతంగా ప్రాసెస్ చేస్తుంది. అలాగే ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ డ్రింక్‌ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె ఆరోగ్యం: ఈ డ్రింక్‌ రోజూ తాగడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తర్వాత రక్తపోటు కూడా తగ్గుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తనాలను రక్షించి గుండె సంబంధించి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తద్వారా మీరు ఎలాంటి గుండె జబ్బుల భారీగా పడకుండా ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.