AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది..? మీరు చేసే తప్పుతో మీ ప్రాణాలకే రిస్క్..

ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారం తింటున్నారా? అయితే మీరు ఆ ఆహారాన్ని ప్యాక్ చేసే టిఫిన్ బాక్స్ మీద కూడా ఒక కన్నేయాల్సిందే.. మనం వాడే రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలు మనకు తెలియకుండానే ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్.. వీటిలో ఏది బెస్ట్? అనేది తెలుసుకుందాం..

స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది..? మీరు చేసే తప్పుతో మీ ప్రాణాలకే రిస్క్..
Best Lunch Box For Health
Krishna S
|

Updated on: Feb 17, 2026 | 10:02 AM

Share

మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం కానీ ఆ ఆహారాన్ని దేనిలో ప్యాక్ చేస్తున్నాం అనే విషయాన్ని విస్మరిస్తాం. అవును మనం ఎంత ఖరీదైన పోషకాహారం తింటున్నామన్నది కాదు, అది దేనిలో తింటున్నామన్నదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఉదయం వండిన వేడి వేడి పదార్థాలను మధ్యాహ్నం వరకు లంచ్ బాక్సుల్లో పెడతాం. కానీ, ఆ అలవాటు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని మీకు తెలుసా? లంచ్ బాక్స్ ఎంపికలో మనం చేసే చిన్న పొరపాట్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టీల్.. గోల్డ్ స్టాండర్డ్

భారతీయ సంప్రదాయంలో స్టీల్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. స్టీల్ ఒక నాన్-రియాక్టివ్ మెటల్. అంటే ఇది ఆహారంతో ఎటువంటి రసాయన చర్య జరపదు. ఇది ఆహారం సహజ రుచిని, పోషకాలను కాపాడుతుంది. శుభ్రం చేయడం సులభం, పర్యావరణానికి మేలు చేస్తుంది. దీనిని మైక్రోవేవ్‌లో నేరుగా వేడి చేయలేం. కానీ నేటి కాలంలో ఇన్సులేటెడ్ స్టీల్ బాక్సులు లభిస్తున్నాయి.. ఇవి 4-6 గంటల పాటు ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి.

గ్లాస్: మోడ్రన్ అండ్ సేఫ్

ఆధునిక కార్పొరేట్ ఆఫీసుల్లో గ్లాస్ బాక్సుల వినియోగం పెరగడానికి కారణం వాటి నాణ్యత. ముఖ్యంగా మైక్రోవేవ్ వాడేవారికి గ్లాస్ బాక్సులు బెస్ట్ ఛాయిస్. సాధారణ గాజు కంటే బోరోసిలికేట్ రకం గ్లాస్ బాక్సులు మేలైనవి. ఇవి విపరీతమైన వేడిని తట్టుకుంటాయి. ఇవి 100శాతం రసాయన రహితం. ప్లాస్టిక్ లాగా ఆహారం వాసనను లేదా రంగును పీల్చుకోవు. ఆఫీసుల్లో మైక్రోవేవ్ వాడేవారికి ఇది అత్యంత సురక్షితమైన ఎంపిక.

ప్లాస్టిక్..స్లో పాయిజన్

చాలా మంది తేలికగా ఉంటుందని ప్లాస్టిక్ బాక్సులను ఎంచుకుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన ఎంపిక. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో ఉంచినప్పుడు అందులోని BPA, Phthalates వంటి హానికర రసాయనాలు ఆహారంలోకి విడుదలవుతాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని అనేక పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలను వీలైనంత వరకు నివారించడం ఉత్తమం. ఒకవేళ వాడినా అవి మైక్రోవేవ్ సేఫ్, BPA-Free అయి ఉండాలి.

మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే కాదు, ఆ ఆహారాన్ని మోసే పాత్రపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి స్టీల్ లేదా గాజు పాత్రలను ఎంచుకోవడమే వివేకం.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.