ఇష్టంగా తినే సపోటా చరిత్ర తెలుసా.. ఈ పండుతో వెలకట్టలేనన్ని లాభాలు!

Samatha

16 February 2026

సపోటా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఉష్ణ మండలంలో పండేది.  దీని స్వస్థలం మెక్సికో, ఇంగ్లీష్‌లో ఈ పండును సపోటా , పాప్ పోడిల్లా అని పిలుస్తారు

ఉష్ణ మండల పండు

దీని శాస్త్రీయ నామం ఎకర్స్ సపోటా. సపోటేసిఅనే వృక్ష కుటుంబానికి చెంది ఈ పండును  అమెరికన్ సపోటా అనే ప్రత్యేక పేరు కూడా ఉంది.

శాస్త్రీయ నామం

గుజరాత్‌లో ఈ సపోటాను విపరీతంగా పండిస్తున్నారు. అందుకే గుజరాత్ ను సపోటా రాష్ట్రం అని కూడా అంటారు.

ఎక్కువ పండించే రాష్ట్రం

ఇక భారత దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, మధ్య ప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాలలో ఈ పండును పండిస్తున్నారు.

సాగు రాష్ట్రాలు

ఇక సపోటా పండులో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

విటమిన్స్, మినరల్స్

ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని పోషకాలు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె సంబంధిత రుగ్మతల నుంచి రక్షణ కల్పిస్తుంది.

గుండె ఆరోగ్యం

ప్రతి రోజూ రెండు సపోటా పండ్లు తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అందుకే వైద్యులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది తినాలని చెబుతుంటారు.

రెండు పండ్లు తప్పనిసరి

అదే విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి నిద్రపోయే సమయంలో ఒక గ్లాస్ సపోటా జ్యూస్ తాగడం వలన నిద్ర త్వరగా పడుతుందంట.

నిద్రలేమి