చికెన్ కీమా పరాటా ఇలా చేస్తే.. టేస్ట్ సూపర్ అంటూ మొత్తం లాగించేస్తారు!
Prasanna Yadla
16 February 2026
Pic credit - Pixabay
చికెన్, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెను తీసుకోవాలి.చికెన్ కీమా పరాటా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు
ముందుగా చికెన్ కీమాను తీసుకుని దానిలో ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంటపై కొద్దిగా వేయించాలి.
స్టెప్ - 1
కీమా చల్లారిన తర్వాత గోధుమ పిండిని వేసి పెద్ద ముద్దలాగా చేసి చిన్న చిన్న ఉండలు లాగా చేసుకోవాలి
స్టెప్ - 2
ఇక ఇప్పుడు ఆ ఉండలను తీసుకుని చపాతీలు చేసుకున్నట్లు అలాగే పరాటాలను చేసుకోవాలి.
స్టెప్ - 3
స్టవ్ వెలిగించి వేడి పెనం పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పరాటాను పెట్టాలి
స్టెప్ - 4
ఇక ఇప్పుడు రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం మంటపై పరాటాలను బాగా కాల్చాలి.
స్టెప్ - 5
కాలిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ కీమా పరాటా రెడీ. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు.
స్టెప్ - 6
ఈ చికెన్ కీమా పరాటాలను సలాడ్ తో పెట్టుకుని తింటే ఉదయం కావాల్సినంత పవర్ వస్తుంది.
చికెన్ కీమా పరాటా
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!