Kushboo Sundar : ఇండస్ట్రీలో ఇప్పటికీ మేల్ డామినేషన్ ఉంది.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అమ్మ, అత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఖుష్బూ సుందర్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.

అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందిఈ అందాల భామ.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. కాగా ఖుష్బూ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరిగే సంఘటనల పైన ఆమె గొంతు విప్పుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఇంకా రావాలి. మహిళ ప్రధాన చిత్రాలు ఎక్కువగా విడుదల కావాలి. అరణ్మణ 4, మూకుతి అమ్మన్ 2 వంటి మహిళా ప్రధాన చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయని ఆమె అన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రజనీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి నటుల ఆధిపత్యం ఇప్పటికీ సినిమాలలో ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం, OTT ప్లాట్‌ఫామ్‌లలో మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అని ఆమె అన్నారు. కాగా సుందర్ సి దర్శకత్వం వహించిన 2024 చిత్రం అరణ్మనై 4 ను ఖుష్బూ నిర్మించారు. తమన్నా భాటియా, రాశి ఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు సుందర్ సి తదుపరి చిత్రం, మూకుతి అమ్మన్ 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నయనతార మరియు రెజీనా కాసాండ్రా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..