Geetha Govindam: ఒక్క సీన్‍తో గత్తరలేపిన చిన్నది.. నెట్టింట అందాల అరాచకమే.. ఇప్పుడేం చేస్తుందంటే..
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఫాలోయింగ్ తెచ్చుకుంటారు. కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి చాలా ఫేమస్ అయ్యింది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతా గోవిందం ఒకటి. తొలినాళ్లల్లో విజయ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తొలిసారిగా వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో ఇద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ ఆకట్టుకుంది. గీతా గోవిందం సినిమాతో ఈ హిట్ పెయిర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ మెరిశారు. ఇక ఈ మూవీలో మరో అమ్మాయి సైతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. 2018లో విడుదలైన ఈ సినిమాలో ఓ వయ్యారి అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో కనిపించింది కాసేపు అయినప్పటికీ ఏ రేంజ్ పాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇందులో విజయ్ ను ప్రేమించిన కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. ఆమె పేరు అనీషా దామా. ఈ సినిమాలో ఆమె విజయ్ వెంట పడే సీన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న అనీషా.. ఆ తర్వాత హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిట్ చేసింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో సత్తిగాని రెండెకరాలు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనీషా. నిత్యం క్రేజీ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..