AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz: మొదటిసారి భర్త గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఇలియానా.. పెళ్లి మాత్రం మిస్టరీ అంటోంది..

ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. కానీ తన మ్యారెజ్, భర్త గురించిన విషయాలను మాత్రం షేర్ చేసుకోలేదు. గతేడాది ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మించింది. తన కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని చెబుతూ తన కొడుకు ముఖాన్ని చూపించింది. తన బాబుతో ప్రస్తుతం గడుపుతున్న హ్యాపీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. కానీ తన భర్త గురించి మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం తన భర్త ఫోటోను షేర్ చేస్తూ..

Ileana D'Cruz: మొదటిసారి భర్త గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఇలియానా.. పెళ్లి మాత్రం మిస్టరీ అంటోంది..
Ileana D'cruz
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2024 | 11:13 AM

Share

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమైంది ఇలియానా. సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా హిట్స్ అందుకుని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరమై.. పర్సనల్ లైఫ్ చూసుకుంది. కొద్ది నెలల క్రితం పెళ్లి కబురు చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. కానీ తన మ్యారెజ్, భర్త గురించిన విషయాలను మాత్రం షేర్ చేసుకోలేదు. గతేడాది ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మించింది. తన కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని చెబుతూ తన కొడుకు ముఖాన్ని చూపించింది. తన బాబుతో ప్రస్తుతం గడుపుతున్న హ్యాపీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. కానీ తన భర్త గురించి మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం తన భర్త ఫోటోను షేర్ చేస్తూ.. అతడి పేరు మైఖేల్ డోలన్ అని తెలిపింది. అంతకుమించి అతడి గురించి ఏ విషయం బయటకు రానివ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మొదటిసారి తన భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మైఖేల్ తన జీవితంలోకి వచ్చినందుకు.. తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే అతడు అద్భుతమైన భాగస్వామి అని చెప్పుకొచ్చింది. “ప్రసవానంతర డిప్రెషన్ నిజమైంది. అందుకు ఏదీ సిద్దం చేయదు. కొడుకు పుట్టిన తర్వాత నాకు ఇంట్లో మంచి సపోర్ట్ లభించింది. నన్ను, నా కుమారుడిని వైద్యులు బాగా చూసుకున్నారు. నా బాబు వేరే గదిలో.. నేను మరో గదిలో ఉండడంతో చాలా ఏడ్చాను. ఆ సమయంలో నా భర్త మైఖేల్ నాకు తోడుగా ఉన్నాడు. నన్ను విశ్రాంతి తీసుకోవాలని చెప్పి.. బాబును తనే దగ్గరుండి చూసుకున్నాడు. మైఖేల్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు. అతడు అధ్భుతమైన భాగస్వామి అయినందుకు నేను కృతజ్ఞురాలిని” అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

అలాగే.. తన భర్త మైఖేల్ గురించి జనాలు చెత్తగా మాట్లాడటం తనకు ఇష్టం లేదని తెలిపింది. మైఖేల్ ను వివాహం చేసుకున్నారా ? అని ప్రశ్నించగా..మరోసారి మాట దాటేసింది ఇలియానా. తన పెళ్లి గురించి జనాల్లో చాలా ఊహాగానాలు ఉన్నాయని.. వాటిని అలాగే వదిలేద్దామని తెలిపింది. తన పెళ్లి గురించి చిన్న మిస్టరీని కలిగి ఉండడం చాలా ఆనందంగా ఉందని.. తన భర్త, పెళ్లి గురించి అనేక విషయాలు పంచుకోవాలని ఉందని.. కానీ తనకు నచ్చినవారి గురించి జనాలు చెత్తగా మాట్లాడుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఇలియానా చివరిగా 2021 విడుదలైన ది బిగ్ బుల్‌లో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.