Yatra 2 Teaser: వావ్ అనిపించేలా యాత్ర-2 టీజర్.. జగన్ పాత్రలో నటించిన జీవా
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. వైఎస్‌ఆర్ మరణానంతర పరిణామాలను..జగన్ ఎలా ఎదుర్కొన్నారనే దానిపై ఈ సినిమా తీశారు. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

యాత్ర 2 టీజర్ విడుదలైంది. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలను అప్పట్లో వైఎస్ జగన్ ఏ విధంగా ఎదుర్కున్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నేతల క్యారెక్టర్స్‌ను కూడా చూపించారు. సోనియాగాంధీని పోలిన పాత్ర అప్పట్లో జగన్ విషయంలో ఎలా వ్యవహరించారనే అంశాలను యాత్ర 2లో చూపించారు. ఇక ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పాత్రను కూడా యాత్ర 2లో ఉంటుంది. యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా కనిపించి మెప్పించిన మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు.
2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా అప్పట్లో వైసీపీకి పొలిటికల్ మైలేజీని తీసుకురావడంలో హెల్ప్ అయ్యింది. ఆ సినిమాలోని నేను విన్నాను.. నేను ఉన్నాను అని మమ్ముట్టి చెప్పే డైలాగ్‌ను.. 2019 ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు వైఎస్ జగన్. ఇక యాత్ర 2 సినిమా సైతం మరోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల కానుండటంతో.. ఈ మూవీ అధికార వైసీపీకి మరోసారి పొలిటికల్ మైలేజీ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



