Watch Video: మీరేం దొంగలు రా నాయనా..! చోరి కోసం వెళ్లి ఏం చేశారో తెలిస్తే..
చోరికి వెళ్లిన దొంగలు దొరికితే, వదిలేయమని ప్రదేయ పడమో, లేదా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడో, లేదా లొంగిపోవడలో మేస్తారు. కానీ ఇక్కడ ఓ ఇంట్లో చోరి చేసేందుకు ప్రయత్నంచి అడ్డంగా దొరికిపోయిన దొంగలు మాత్రం ఎవరూ ఊహించని పని చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ పాలయ్యారు.

దొంగతనం కోసమని వచ్చి దొరికిపోయిన దొంగలు తమను వదిలేయకపోతే.. బ్లేడ్‌తో కోసకొని ఆత్మమత్య చేసుకుంటామని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సదాశిపేట మండల్ ఆరుర్ గ్రామానికి చెందిన రాచన్న కుటుంబం ఇటీవలే స్వామి వారి మొక్కు తీర్చుకునేందు భద్రాచం వెళ్లారు. అయితే అదే రోజూ రాత్రి వారి ఇంటి పరిసరాల్లోకి వచ్చిన కొందరు దొంగలు ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి.. తాళాలు విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
అయితే ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఇంట్లోకి ఎవరో ప్రవేశిస్తున్నట్టు గమనించిన భద్రాచలంలో ఉన్న ఇంటి యజమానులు.. పక్కింటి వారితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న స్థానికులు దొంగలను పట్టుకున్నారు. అంతలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.
అయితే పోలీసులను చూసిన దొంగలు తమ దగ్గర ఉన్న బ్లేడ్‌లను తీసి.. తమను విడిచి పెట్టకపోతే.. వాటితో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతామని బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు. చివరకు పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకొని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విష్ణు, మోహన్ గా పోలీసులు గుర్తించారు. వారిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
