Arthana Binu: ‘సినిమాలు చేయడం ఆపేయ్.. లేదంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’.. హీరోయిన్ అర్థనా షాకింగ్ కామెంట్స్..

ఆమె చూడచక్కని రూపం.. అమాయకత్వంతో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేయలేదు.

Arthana Binu: 'సినిమాలు చేయడం ఆపేయ్.. లేదంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు'.. హీరోయిన్ అర్థనా షాకింగ్ కామెంట్స్..
Arthana Binu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2023 | 4:37 PM

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అర్థనా బిను. ఇందులో ఆమె చూడచక్కని రూపం.. అమాయకత్వంతో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేయలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్ పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తండ్రి తనను సినిమాలు ఆపేయాలని.. లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. అక్రమంగా తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోను షేర్ చేసింది.

కాగా కొంతకాలం క్రితం అర్థనా బిను తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్థనా తన చెల్లెలితో కలిసి తన తల్లితో ఉంటుంది. విడాకులు తీసుకున్నప్పటికీ తన తండ్రి తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తన తండ్రి ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేస్తూ.. అతడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది.

ఇవి కూడా చదవండి

“ఈరోజు అతను మా కాంపౌండ్ లోకి ప్రవేశించాడు. అప్పటికే మేము తలుపు లోపలి నుంచి గడియపెట్టుకున్నాం. దీంతో అతను కిటికీ ద్వారా మమ్మల్ని బెదిరించాడు. నా సోదరిని, అమ్మను చంపేస్తానని బెదిరించాడు. నేను సినిమాల్లో నటించడం మానేయాలని..లేదంటే ఎంతకైనా తెగిస్తానని బెదిరించాడు. కిటికిని కొడుతూ పెద్దగా అరిచాడు. బతుకుదెరువు కోసం మా అమ్మ నన్ను అమ్మేస్తోందని అరుస్తున్నాడు. ఇటీవల నేను నటించిన చిత్రబృందంతోనూ చెడుగా మాట్లాడాడు. ఒకవేళ నాకు నటించాలని ఉంటే అతను చెప్పిన సినిమాల్లోనే నటించాలని అంటున్నాడు. నేను పనిచేస్తున్న సెట్ లోకి, మా అమ్మ పనిచేసే కార్యాలయంలోకి వెళ్లి గొడవ చేస్తున్నాడు. అతనిపై కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇదంతా చేస్తున్నాడు. నేను సినిమాలు నటించకుండా ఆపాలని కేసు పెట్టాడు. అప్పుడు నేను నా ఇష్టానికి సినిమాల్లో నటిస్తున్నానని.. నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం నటిస్తుంటాను. నేను షైలాక్ సినిమాలో నటించినప్పుడు అతను లీగల్ గా కేసు పెట్టాడు. దీంతో ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా ఇష్టానుసారంగా సినిమాలో నటిస్తున్నానన చట్టపరమైన పత్రంపై సంతకం చేయాల్సి వచ్చింది” అంటూ సుధీర్ఘ నోట్ రాసింది.

View this post on Instagram

A post shared by Arthana Binu (@arthana_binu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్