Sai Rajesh: ‘బేబీ’ డైరెక్టర్‌కు పవన్‌ కల్యాణ్ ‘బ్రో’ షూస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత.. ధరెంతో చెప్పేశాడుగా..

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ స్టార్‌ వైష్ణవి జంటగా నటించిన చిత్రం 'బేబి'. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ సినిమాకు సాయి రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో కొబ్బరిమట్ట, కలర్‌ ఫొటో, హృదయం కాలేయం వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

Sai Rajesh: 'బేబీ' డైరెక్టర్‌కు పవన్‌ కల్యాణ్ 'బ్రో' షూస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత.. ధరెంతో చెప్పేశాడుగా..
Director Sai Rajesh
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 5:00 PM

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ స్టార్‌ వైష్ణవి జంటగా నటించిన చిత్రం ‘బేబి’. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ సినిమాకు సాయి రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో కొబ్బరిమట్ట, కలర్‌ ఫొటో, హృదయం కాలేయం వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ అనుభవంతోనే మెగా ఫోన్‌ పట్టుకుని బేబీ సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల ఫస్ట్‌ కాపీనీ సినిమా నిర్మాత ఎస్‌ కే ఎన్‌కు చూపించారట. ఆయనకు కూడా మూవీ తెగ నచ్చేసిందట. ఈ ఆనందంలో డైరెక్టర్‌కు షూస్‌ బహుమతిగా ఇచ్చారట. అదేంటి.. మరీ షూస్‌ గిఫ్ట్‌గా ఇవ్వడమేంటి? అనుకుంటున్నారా? అవి అలాంటి, ఇలాంటి షూస్‌ కాదండి బాబూ.. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్‌ ధరించిన షూస్‌ అట. ‘ మా బ్రో బేబీ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి ఈ బ్రో షూస్‌ బహుమతిగా ఇచ్చాడు. మళ్లీ ఇంతటి ఖరీదైన షూలు కొనాలనే ఆలోచన వస్తే కూడా భయంగా ఉంది’ అని తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు డైరెక్టర్‌ సాయి రాజేష్‌.

ప్రస్తుతం ఈ షూస్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల రిలీజైన బ్రో మూవీ పోస్టర్‌లో పవన్‌ ధరించిన షూస్‌ తెగ హైలెట్‌ అయ్యాయి. నెటిజన్లు వాటి కోసం గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్‌ బల్మైన్‌కు చెందిన ఈ షూస్‌ ధర లక్షకు పైమాటే. తాజాగా ఈ ఖరీదైన షూస్‌నే బేబీ డైరెక్టర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు ఎస్‌కేఎన్‌. కాగా తన పోస్టులో షూస్‌ రేట్‌ ఎంతో కూడా చెప్పాడు సాయి రాజేష్‌. అన్నట్లు దీని ధరెంతో తెలుసా రూ.1,06,870. కాగా ఆనంద్‌ దేవరకొండ నటించిన బేబి సినిమా జులై 14న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అలాగే పవర్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sai Rajesh (@sairazesh)

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.