Dasara Navaratri: దుర్గాదేవిగా ప్రముఖ నటి.. పులిపై కూర్చొని నృత్య ప్రదర్శన.. ఎవరో గుర్తు పట్టారా?
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవీ నవరత్రాలను పురస్కరించుకుని చాలా చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గమ్మ మహిమలు, గొప్ప తనం తెలిపేలా నాట్య ప్రదర్శనలు, నాటికలు నిర్వహిస్తున్నారు
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవీ నవరత్రాలను పురస్కరించుకుని చాలా చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గమ్మ మహిమలు, గొప్ప తనం తెలిపేలా నాట్య ప్రదర్శనలు, నాటికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆదివారం నవ్ దుర్గా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధుర ఎంపీ, అలనాటి అందాల తార, డ్రీమ్ గర్ల్ హేమా మాలిని దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నృత్య నాటక ప్రదర్శనలో భాగంగా ఆమె దుర్గామాత పాత్రను పోషించారు. పులిపై కూర్చున్న అమ్మవారిగా నృత్య ప్రదర్శన ఇచ్చారు. తద్వారా అక్కడున్న వారందరి ప్రశంసలు అందుకున్నారు బీజేపీ ఎంపీ. ప్రస్తుతం హేమ మాలినీ నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు, అభిమానులు హేమ మాలినీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చం దుర్గామాత అమ్మవారిలానే ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.
హేమ మాలిని నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ‘ఈ రోజు ఇక్కడ ప్రదర్శన నేను ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దుర్గామాత నృత్య నాటకం చూసి ప్రశంసించారు’ అని చెప్పుకొచ్చింది హేమ మాలినీ.
దుర్గా మాతగా హేమమాలిని, ఎంపీ ప్రశంసలు..
Some photos from the ‘Durga’ ballet in Mathura on the 8th. Om Birla ji, Speaker Lok Sabha was the Chief Guest pic.twitter.com/dDnnOStk7a
— Hema Malini (@dreamgirlhema) October 8, 2024
కాగా ఇప్పుడే కాదు గతంలోనూ పలు సార్లు ఇలా అమ్మవారి రూపాల్లో కనిపించారు హేమ మాలిని. ఎంపీగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి అలరించారామె. ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య బాల రాముడి ప్రతిష్ఠాపన ఉత్సవాల్లోనూ అద్భుత నృత్యంతో భక్తులను అలరించారీ అందాల తార.
నవరాత్రి ఉత్సవాల్లో హేమ మాలిని..
After a successful presentation of the ballet ‘Durga’ at Mathura’s new state of the art auditorium, ‘Panchjanya’ yesterday, I visited Ma Durga’s temples in Vrindavan today. The first, Sheravali Mata in Chintamani Kunj and then to the pracheen Adishakti Peet Katyayni Devi temple… pic.twitter.com/JoMDavIclk
— Hema Malini (@dreamgirlhema) October 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..