Actor Yash: రావణుడి పాత్రకు ఒప్పుకొవడానికి రీజన్ అదే.. యష్ ఏమన్నారంటే..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ రామాయణ. డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు.

దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రాముడిగా బీటౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతమ్మ పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ లీకయ్యాయి. ఇక ఇందులో రావణుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామాయణ సెట్స్ లో అడుగుపెట్టాడు యష్. తాజాగా ఈ చిత్రంలో రావణుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో వెల్లడించారు. యష్ మాట్లాడుతూ.. “ఇది చాలా ఆకర్షణీయమైన పాత్ర. నేను వేరే ఏ కారణం చేతనైనా అలా చేసి ఉండేవాడిని కాదు. రామాయణంలో వేరే ఏదైనా పాత్ర పోషించడానికి నేను ఇష్టపడతానా అని మీరు నన్ను అడిగి ఉంటే, బహుశా అలా చేయకపోవచ్చు. నాకు, నటుడిగా నటించడానికి అత్యంత ఉత్తేజకరమైన పాత్ర రావణుడు. ఈ ప్రత్యేక పాత్రలోని సవాళ్లు నాకు చాలా ఇష్టం. ఈ పాత్రను విభిన్నంగా ప్రజెంట్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు.
అంతకు ముందు మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లాస్ ఏంజిల్స్‌లో టాక్సిక్ చిత్రానికి VFX పని చేస్తున్నప్పుడు, DNEG, ప్రైమ్ ఫోకస్‌కు చెందిన నమిత్ మల్హోత్రా తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అదే సమయంలో నమిత్ తనకు రామాయణ సినిమా గురించి చెప్పారని అన్నారు. దీంతో రామాయణ సినిమాపై తాను ఒక అవగాహన పెంచుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో రావణుడి పాత్రను, ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం , నటించడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




