Cobra Movie Review: జస్ట్ విక్రమ్‌ ఎఫర్ట్స్ కోసమే ‘కోబ్రా’

లేటెస్ట్ గా కోబ్రా విషయంలో ఏం జరిగింది.. ఒకటి కాదు, రెండు కాదు, 25 గెటప్పులు మార్చారు కోబ్రా కోసం. ఇంతకీ విక్రమ్‌ ఎఫర్ట్స్ ని ప్రేక్షకులు అప్రిషియేట్‌ చేస్తున్నారా? చదివేయండి.

Cobra Movie Review: జస్ట్ విక్రమ్‌ ఎఫర్ట్స్ కోసమే 'కోబ్రా'
Cobra
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:03 PM

సినిమాల్లో విక్రమ్‌ డెడికేషన్‌ గురించి చెప్పాలంటే పేజీలకు పేజీలు రాసుకోవాల్సిందే. అంతగా ఇన్వాల్వ్ అయి చేస్తారు చియాన్‌. మరి ఆయన కష్టం ఈ మధ్య చాలా సార్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. లేటెస్ట్ గా కోబ్రా విషయంలో ఏం జరిగింది.. ఒకటి కాదు, రెండు కాదు, 25 గెటప్పులు మార్చారు కోబ్రా కోసం. ఇంతకీ విక్రమ్‌ ఎఫర్ట్స్ ని ప్రేక్షకులు అప్రిషియేట్‌ చేస్తున్నారా? చదివేయండి.

తారాగణం: విక్రమ్‌, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్‌ పఠాన్‌, రోషన్‌ మాథ్యూ, కేఎస్‌ రవికుమార్‌, మృణాళిని రవి, మియా జార్జ్ తదితరులు

రచన- దర్శకత్వం: అజయ్‌ జ్ఞానముత్తు

ఇవి కూడా చదవండి

నిర్మాత: లలిత్‌కుమార్‌

కెమెరా: హరీష్‌ కణ్ణన్‌

ఎడిటర్‌: భువన్‌ శ్రీనివాసన్‌

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

పాటలు: రాకేందు మౌళి

విడుదల: ఆగస్టు 31

మది (విక్రమ్‌) లెక్కల జీనియస్‌. లెక్కల మాస్టార్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఇంటర్నేషనల్‌ వైడ్‌ జరిగే క్రైమ్స్ తో అతనికి సంబంధం ఉంటుంది. ఓ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ ఇతనికి సుపారీ ఇస్తుంటాడు. అలా సంపాదించిన డబ్బు మొత్తం అనాథాశ్రమాలకు పంచుతుంటాడు. మది కోసమే భావన మీనన్‌ (శ్రీనిధి) వెయిట్‌ చేస్తుంటుంది. ఆమె ఇంట్లో వాళ్లు అంగీకరించే దాకా పెళ్లి చేసుకోనంటాడు మది. అతని ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటుంది. అయినా అతని చీకటి కోణం ఆమెకి తెలియదు. రిషి వల్ల మదికి ఓ సారి ఇబ్బంది కలుగుతుంది. అదేంటో తెలుసుకునే క్రమంలో అతనికి కదిర్‌ గురించి తెలుస్తుంది. తన పని మానుకుని కదిర్‌ని కాపాడుతాడు. ఇంతకీ మదిలాగా కనిపించే కదిర్‌ ఎవరు? మది తల్లిని ఎందుకు ఉరి తీశారు? కదిర్‌ వల్ల మది జీవితంలో జరిగిన పొరపాటేంటి? వంటివన్నీ సినిమాలో సెకండ్‌హాఫ్‌లో తెలుస్తాయి.

సినిమా కోసం విక్రమ్‌ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. విక్రమ్‌ అన్ని గెటప్పులు వేసినా, ఆ గెటప్పుల్లో ఉన్నది విక్రమ్‌ అని కనిపెట్టడం కష్టం. మేకప్‌ అంత పర్ఫెక్ట్ గా సూట్‌ అయింది. చాలా బాగా చేశారు. ఆ ఏజ్‌లో అంతెత్తున విక్రమ్‌ చేసిన ఫైట్లు, జంపింగ్స్ అన్నీ మెప్పిస్తాయి. మృణాళిని రవి, శ్రీనిధి శెట్టి తమకిచ్చిన కేరక్టర్లకు న్యాయం చేశారు. ఇర్ఫాన్‌ ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. కేఎస్‌ రవికుమార్‌ కేరక్టర్‌ కూడా మెప్పిస్తుంది. సినిమాను ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తీశారు. కెమెరా పనితనం సూపర్‌గా ఉంది. ప్రతి ఫ్రేములోనూ యూనిట్‌ కష్టం కనిపిస్తుంది.

అన్నీ బావున్నా, సినిమా అంతా బావుండకపోవడానికి మెయిన్‌ రీజన్‌ సినిమా కథ సామాన్యులకు దూరంగా ఉంటుంది. స్క్రీన్‌ మీద డైరక్టర్‌ ఏం చెబుతున్నాడో అర్థం కాదు. ఇంటలెక్చువల్‌ సబ్జెక్ట్ ఇది. నైట్రోజన్‌, మీథేన్‌, హ్యాకింగ్‌, హాల్యూజనేషన్‌ వంటివన్నీ పామరులకు ఎంతవరకు అర్థమవుతాయన్నది పెద్ద క్వశ్చన్‌ మార్క్. అయినా కోబ్రాను చూడాలని ఫిక్స్ అయి వెళ్లిన వాళ్లకు కూడా స్క్రీన్‌ మీద ఏం జరుగుతుందో అర్థం కాదు. అంతా కంగాళీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని బాగానే డిజైన్‌ చేసుకున్న డైరక్టర్‌ సెకండాఫ్‌ మీద ఎందుకు గ్రిప్‌ మిస్‌ అయ్యారో అర్థం కాదు.

సెకండ్‌హాఫ్‌లో అసలు మది ఎవరో? కదిర్‌ ఎవరో? తెలియని పరిస్థితి. ఎవరు ఎవరి మీద ఎందుకు కోపంగా ఉన్నారో, అసలు భావనను ప్రేమించిన వ్యక్తి ఎవరో? ఎందుకు త్యాగం చేశాడో ఏమీ చెప్పలేం. ప్రీ క్లైమాక్స్ లో మదిని పోలీసులు ఇంటరాగేట్‌ చేస్తున్నప్పుడు చుట్టుపక్కలవాళ్లంతా కలిసి ఓ నాన్‌సెన్స్ రప్చర్‌ చేస్తారు. సేమ్‌ టు సేమ్‌ థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే కంగాళీగా ఉంటుంది.

విక్రమ్‌ ఎఫర్ట్స్ ని చూడాలనుకునేవారు చూడొచ్చు. కోబ్రాని చూడకపోయినా పెద్దగా మిస్‌ అయ్యేదేం ఉండదు. రేటింగ్‌: 1.75/5 – డా. చల్లా భాగ్యలక్ష్మి