Vijay Antony: గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని సినిమా ప్రమోషన్లకు విజయ్.. చిన్న కూతురితో కలిసి..

గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని రత్తం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు విజయ్. తన వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాకు..తోటీ నటీనటులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనట్లుగా సమాచారం. చిన్న కూతురు లారా ఆంటోనితో కలిసి విజయ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Vijay Antony: గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని సినిమా ప్రమోషన్లకు విజయ్.. చిన్న కూతురితో కలిసి..
Vijay Antony
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2023 | 9:06 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని జీవితంలో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ బలవన్మరణానికి పాల్పడం అందరినీ కలిచి వేసింది. 16 ఏళ్ల వయసులోనే మానసిక ఒత్తిడి భరించలేక సెప్టెంబర్ 19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని.. ఇక పై ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని ఇటీవల ట్వీట్ చేశారు విజయ్.

తాజాగా గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుని రత్తం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు విజయ్. తన వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాకు..తోటీ నటీనటులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనట్లుగా సమాచారం. చిన్న కూతురు లారా ఆంటోనితో కలిసి విజయ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వీడియోస్ చూసిన నెటిజన్స్.. విజయ్ నిబద్ధత.. ఎంతో గొప్ప మనసు కలిగిన నటుడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రత్తం. సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 6 విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు విజయ్. జీవితంలో జరిగిన అతిపెద్ద విషాదం తర్వాత విజయ్ ఆంటోనీకి ఇది మొదటి ఇంటర్వ్యూ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.