AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy : హైకోర్టులో విజయ్ దళపతికి చుక్కెదురు.. ఆ కేసు కొట్టివేత.. అసలేం జరిగిందంటే..

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం సినిమా వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సొంతంగా పార్టీ స్థాపించిన ఆయన..కొన్నాళ్లుగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కు మద్రాసు హైకోర్టులో మరోసారి నిరాశే ఎదురయ్యింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Vijay Thalapathy : హైకోర్టులో విజయ్ దళపతికి చుక్కెదురు.. ఆ కేసు కొట్టివేత.. అసలేం జరిగిందంటే..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2026 | 11:53 AM

Share

కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టులో నిరాశే ఎదురైంది. పన్ను ఎగవేత కేసులో విజయ్ విధించిన రూ.1.5 కోట్లు జరిమానాను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఆదాయాన్ని దాచినందుకు అతడిపై జరిమాన విధించడంలో చట్ట ఉల్లంఘన జరగలేదని జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి తీర్పునిచ్చింది. 2015 -16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించగా.. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. ఇదిలా ఉంటే… విజయ్ తరపు న్యాయవాది ఆయనను అప్పీల్ చేసుకోవడానికి అనుమతించాలని అభ్యర్థించారు. ఆదాయపు పన్ను శాఖ విధించిన జరిమానాను సవాలు చేయడానికి విజయ్ అప్పీలేట్ అథారిటీని సంప్రదించవచ్చని న్యాయమూర్తి చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినప్పుడు, ఆ సంవత్సరానికి ఆయన రూ.35 కోట్ల 42 లక్షల 91 వేల 890 ఆదాయం ప్రకటించాడు. పులి’ చిత్రానికి వచ్చిన రూ.15 కోట్ల ఆదాయాన్ని 2015లో విజయ్ ఇంట్లో జరిగిన దాడిలో స్వాధీనం చేసుకున్న పత్రాలతో పోల్చి చూస్తే, ఖాతాల్లో చేర్చలేదని ఆదాయపు పన్ను శాఖ కనుగొంది. 2022లో ఆదాయపు పన్ను శాఖ ఆదాయాన్ని దాచినందుకు రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలపై నటుడు విజయ్ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు, చట్టం ప్రకారం, జూన్ 30, 2019 కంటే ముందే జరిమానా ఉత్తర్వు జారీ చేయబడి ఉండాల్సిందని, కానీ 2022లో ఆలస్యంగా ఉత్తర్వు జారీ చేయబడినందున, దానిని రద్దు చేయాలని విజయ్ తరపు న్యాయవాది వాదించారు. కానీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం విజయ్ పై జరిమానా విధించడం సరైనదేనని ఆదాయపు పన్ను శాఖ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో ఈరోజు న్యాయమూర్తి సెంథిల్ కుమార రామమూర్తి నటుడు విజయ్ పై జరిమానా విధించి, నిర్ణీత సమయంలోపు ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానా విధించిన ఉత్తర్వులో ఎటువంటి చట్టవిరుద్ధం లేదు. విజయ్ జోక్యానికి ఎటువంటి కారణం లేదని పేర్కొంటూ, ఆయన దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..