AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttej: కడదాకా ఉంటానన్నావ్ కదా పద్దూ! మధ్యలోనే చెయ్యి వదిలేశావ్.. ఒక్క పోస్టుతో ఏడిపించేసిన ఉత్తేజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మావతిని, ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఉత్తేజ్ భార్య 2021లో క్యాన్సర్ తో కన్నుమూసింది.

Uttej: కడదాకా ఉంటానన్నావ్ కదా పద్దూ! మధ్యలోనే చెయ్యి వదిలేశావ్.. ఒక్క పోస్టుతో ఏడిపించేసిన ఉత్తేజ్
Actor Uttej
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 4:18 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ ఉత్తేజ్ బాగా ఎమోషనల్ అయ్యాడు. తన భార్యను, ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఉత్తేజ్ భార్య పద్మావతి 2021లో క్యాన్సర్ తో కన్నుమూసింది. ఇవాళ (ఏప్రిల్ 09) పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో తన భార్యతో కలిసి పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘పద్దూ.. ఈరోజు మన పెళ్లిరోజు.. ఇపుడు బాగా గుర్తుంటోంది.. అప్పుడు, నీ పుట్టినరోజుని,మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుండే గుర్తుపెట్టుకొని.. date వల్లె వేస్తూ ఉండేవాణ్ణి.. ఎక్కడ మర్చిపోతానో అని.. ఇది అందరి మొగుళ్లకి అనుభవైకవేద్యమే.. ఎలా ఉన్నావు పద్దూ! కడదాకా, నే కడతెరే దాకా నా వెంటే ఉంటానన్నావు. మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్..పట్టు సడలి కిందపడ్డాను…లేచి చూస్తే నువ్వు లేవు..పిలిచా..అరిచా.. ఏడ్చా.నువ్వులేవు..ఇంకా వెదుకుతూనే వున్నా.. సంతలో తప్పిపోయిన పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు.. తప్పు చేసావు పద్దూ.. నన్ను మరీ dependent చేసావ్.. అన్నిటికీ తోడున్నావ్..అన్నింటికీ ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు.నేనున్నాగా పర్లేదన్నావ్.. ధైర్యం అయ్యావు.. ఆలంబన అయ్యావు.. ఆసరా అయ్యావు…ముందుంటావనుకున్నా..ముందుగా వెళ్తావనుకోలేదు.. అన్ని పనులు… భోజనం..ఆలనా పాలనాఓ magic లా సాక్షాత్కారమయ్యేవి’

‘తిట్టుకున్నా.. అరుచుకున్నా.. నవ్వుతా..తుళ్లుతా.. ఉండేదానివి.. నాన్న లా భుజం తట్టావు.. తిట్టావు కూడా.. అమ్మలా అక్కున చేర్చుకున్నావు.. ఫ్రెండ్ లా తోడున్నావు.. పాటమ్మ (కూతురు)కి నిన్ను తెచ్చివ్వలేను కానీ.. ఆ స్పర్శ ని అందివ్వలేను కానీ.. నీ బాధ్యతని.. నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్నా.. నాన్న లా 100% ఉంటాను..దానికి నేనయినా ఉన్నాను…నాకే ఎవరూ లేరు.. Love you.. పద్దూ. WE MISSING YOU….’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు ఉత్తేజ్.

ఇవి కూడా చదవండి

ఉత్తేజ్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Paata (@paata_uttej)

ప్రస్తుతం ఉత్తేజ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు ఉత్తేజ్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నయనం అనే ఒక సినిమాలో కనిపించాడు ఉత్తేజ్. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది.  ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

భార్యతో నటుడు ఉత్తేజ్..

View this post on Instagram

A post shared by Paata (@paata_uttej)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us