Janaka Aithe Ganaka Movie: చివరి నిమిషంలో సుహాస్ సినిమా వాయిదా.. కారణం ఇదే..

సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ కూడా షూరు చేసింది చిత్రయూనిట్. కానీ తాజాగా విడుదలకు రెండు రోజుల ముందే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు మేకర్స్.

Janaka Aithe Ganaka Movie: చివరి నిమిషంలో సుహాస్ సినిమా వాయిదా.. కారణం ఇదే..
Janaka Aithe Ganaka
Follow us

|

Updated on: Sep 04, 2024 | 3:12 PM

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు నటిస్తోన్న సరికొత్త సినిమా ‘జనక అయితే గనక’. డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పోస్టర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ కూడా షూరు చేసింది చిత్రయూనిట్. కానీ తాజాగా విడుదలకు రెండు రోజుల ముందే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు మేకర్స్.

“ఇప్పుడు వర్షాల మోత.. ఆ తర్వాత నవ్వుల మోతతో కలుద్ధాం.. !! వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితుల రీత్యా మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. నవ్వుల వినోదంతో త్వరలోనే కలుద్దాం” అంటూ టీమ్ పేర్కొంది. అయితే ఈ సినిమాను మళ్లీ ఎప్పుడూ విడుదల చేయనున్నారు అనే సంగతి మాత్రం తెలియజేయలేదు. కానీ ఈ మూవీకి భారీగానే ప్రమోషన్స్ చేశారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు సుహాస్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నానావస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, విశ్వక్ సేన్, ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల వంటి సినీ తారలు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు.. వారికి ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నారు.

ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.