Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీ సింహ..

ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ బాబు సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుంది అంటూ ఊరిస్తున్నారు. దాంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

Mahesh Babu: మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీ సింహ..
Mahesh Babu , Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2023 | 8:40 AM

ఆర్ ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం సాధించిన రాజమౌళి. తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలా కాలం నుంచి మహేష్ రాజమౌళి మూవీ రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా.? ఉండదా.? అని డౌట్స్ కూడా వచ్చాయి ఆ మధ్య. కానీ తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అని జక్కన్న పలు ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. దాంతో క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ బాబు సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుంది అంటూ ఊరిస్తున్నారు. దాంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే తాజాగా కీరవాణి తనయుడు శ్రీ సింహ మహేష్,రాజమౌళి మూవీ గురించి స్పందించారు. శ్రీసింహ తన కొత్త సినిమా భాగ్ సాలే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్, రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు గారితో పనిచేయడానికి మా కుటుంబమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచేసుతున్నాం.  ప్రస్తుతం ఈ మూవీ మొదటి స్టేజ్ లో ఉంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని అన్నారు.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.