Takkar: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సిద్ధార్థ్‌ టక్కర్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే

థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిది వారాలకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. కొని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చిన వారం రోజులకే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి.

Takkar: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సిద్ధార్థ్‌ టక్కర్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే
Takkar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2023 | 9:10 AM

ఇటీవలే ఓటీటీలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను ఆడుకుంది ఓటీటీలే.. ఇప్పుడు థియేటర్స్ లో మిస్ అయినా సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎనిమిది వారాలకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. కొని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చిన వారం రోజులకే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సిద్ధార్థ్‌ నటించిన సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సిద్ధార్థ్‌, దివ్యాన్షా జంటగా నటించిన ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. సిద్ధార్థ్‌, దివ్యాన్షా టక్కర్ సినిమా మంచి అంచనాల మధ్య విడులైంది. కానీ ప్రేక్షలను మెప్పించలేక పోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది టక్కర్.

టక్కర్ సినిమాను జులై 7న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీక్‌ క్రిష్‌ దర్శకత్వం వహించారు. థియేటర్స్ లో ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోనూ తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది టక్కర్. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.