Shiva Shankar: విషమంగానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడికి సోనూసూద్ ఫోన్..
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని.. పెద్ద కొడుకుకు కరోనా బారిన పడి ప్రస్తుతం అపస్మారక స్థితిలో వెళ్లినట్లుగా వైద్యులు తెలిపారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అజయ్ కోరుతున్నారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్.. శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
ట్వీట్..
Iam already in touch with the family, Will try my best to save his life ? https://t.co/ZRdx7roPOl
— sonu sood (@SonuSood) November 25, 2021
శివశంకర్ మాస్టర్, తెలుగు, తమిళ భాషల్లోని ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కీలక పాత్రలలో నటించి మెప్పించారు. ఇక నాలుగు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు. మగధీర సినిమాలోని ధీర.. ధీర.. ధీర.. పాటకు 2011లో ఆయన జాతీయ పురస్కారం అందుకున్నారు. కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరీక్షించగా.. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు.
Also Read: Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత.. ఎందుకంటే..
Singer Harini: సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అన్యాయంగా తనపై కేసు పెట్టారని ఆవేదనతో..
Sitara: ఆనీ మాస్టర్‌తో సితార స్టెప్పులు మాములుగా లేవుగా.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్..