Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత.. ఎందుకంటే..
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే తన ఫిట్నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అయితే సామ్… చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదంటున్నారు నెటిజన్స్. ఇక తాజాగా విడాకుల ప్రకటన అనంతరం ఇన్ని రోజుల తర్వాత సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోకు సమంత వచ్చినట్లుగా సమాచారం. నాగచైతన్యతో విడాకుల తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు సామ్ రావడం ఇదే ప్రథమం. ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సామ్ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లిందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే… నాగచైతన్య పుట్టినరోజున సామ్ విషెస్ చేయకుండా.. తన కుక్క పిల్లకు బర్త్ డే వేడుకలు జరపడం పై చై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది.
Also Read: Singer Harini: సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. రైల్వే ట్రాక్ పై మృతదేహం..
Sitara: ఆనీ మాస్టర్‌తో సితార స్టెప్పులు మాములుగా లేవుగా.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్..
Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..