Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitara: ఆనీ మాస్టర్‏తో సితార స్టెప్పులు మాములుగా లేవుగా.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచి సితారకు ఫాలోయింగ్

Sitara: ఆనీ మాస్టర్‏తో సితార స్టెప్పులు మాములుగా లేవుగా.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్..
Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2021 | 10:49 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచి సితారకు ఫాలోయింగ్ ఎక్కువే. సూపర్ స్టార్ కూతురిగా చిన్నవయసులోనే తన ముద్దు మాటలతో.. అల్లరి చేష్టలతో అభిమానులకు ఆకట్టుకున్న సితార.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్స్‏ను బయటపెడుతూ సూపర్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. చిన్న వయసులోనే మహేష్ పాటలకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది సితార. తాజాగా మరోసారి సితార తన డాన్సింగ్ టాలెంట్ చూపించింది.

పాపులర్ కొరియోగ్రాఫర్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆనీ మాస్టర్ దగ్గర ఓ వెస్టర్న్ పాటకు స్టెప్పులేయడం నెర్చుకుంది. ఆనీ మాస్టర్ స్టెప్పులకు మ్యాచింగ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నాను అంటూ ఓ వీడియోను షేర్ చేసింది సితార. అందులో ముందు ఆనీ మాస్టర్ డ్యాన్స్ చేస్తుండగా.. సితార కూడా అందుకు తగినట్టుగా స్టెప్పులేస్తు కనిపించింది.

ఇక ఆ తర్వాత సోలోగా ట్రై చేశా.. ఇంకోటి చేయమంటరా అంటూ ట్యాగ్ చేస్తూ.. తను ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. సితార డాన్సింగ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మహేష్ గారాలపట్టి డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.

Also Read: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ నుంచి జననీ సాంగ్.. ఈరోజు థియేటర్లలో.. లైవ్..

Shahid Kapoor: సినిమా కోసం బిచ్చగాడిలా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..