AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: పుట్టిన రోజున మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన సోనూసూద్.. 500 మంది వృద్ధుల కోసం..

రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే ఈ నటుడు ఈసారి పండుటాకుల కోసం ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దీంతో ఈ రియల్ హీరోపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Sonu Sood: పుట్టిన రోజున మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన సోనూసూద్.. 500 మంది వృద్ధుల కోసం..
Actor Sonu Sood
Basha Shek
|

Updated on: Jul 31, 2025 | 6:15 PM

Share

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ బుధవారం (జులై 30) 52వ వసంతంలోకి అడుగు పెట్టాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ రియల్ హీరోకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. చాలా చోట్ల సోనూసూద్ అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తన పుట్టిన రోజున మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. పండుటాకుల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇందులో సుమారు 500 మంది వృద్దులకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపాడు. అనాథలైన వృద్ధులకు ప్రేమతో కూడిన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు సోనూసూద్. వృద్ధులకు ఆశ్రయం, వైద్య సదుపాయాలు, పోషకాహారం తదితర సదుపాయాలు కల్పించేలా ఈ వృద్ధాశ్రమాన్నిఏర్పాటు చేస్తున్నట్లు ఈ రియల్ హీరో తెలిపాడు. మరీ ముఖ్యంగా మలివయసులో వారికి కావాల్సిన ఎమోషనల్‌ సపోర్ట్‌ కూడా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ఈ రియల్‌ హీరోపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది.

కాగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నాడు. అయితే వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటుచేస్తాడన్నది సోనూసూద్ తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఓ వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు సోనూసూద్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

సోనూసూద్ బాటలోనే అతని అభిమానులు కూడా..

ఇక సినిమాల విషయానికి వస్తే.. సోను సూద్ చివరిగా ఫతే అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అతని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాగానే ఆడింది. ప్రస్తుతం నంది అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూసూద్. ఈ చిత్రానికి కూడా అతనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..