టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న మరో కన్నడ హీరో.. ‘ఓల్డ్ మాంగ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్..

ప్రస్తుత కాలంలో కన్నడ హీరోలు తమ సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ హీరో యశ్.. కేజీఎఫ్ సినిమాను తెలుగులో విడుదల

  • Rajitha Chanti
  • Publish Date - 10:01 pm, Thu, 8 April 21
టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న మరో కన్నడ హీరో.. 'ఓల్డ్ మాంగ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్..
Old Monk

ప్రస్తుత కాలంలో కన్నడ హీరోలు తమ సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ హీరో యశ్.. కేజీఎఫ్ సినిమాను తెలుగులో విడుదల చేసి..ఆల్ టైం రికార్డు సొంతం చేసుకున్నాడు. కంటెంట్ నచ్చితే తెలుగు ప్రజలు సినిమాను భారీగా ఆదరిస్తారని తెలుసుకున్న కన్నడ దర్శక నిర్మాతలు తమ చిత్రాలను తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల ధృవ్ సర్జా నటించిన పొగరు, దర్శన్ నటించిన రాబర్ట్, యువరత్న సినిమాలు విడుదలయ్యి మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో హీరో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

క‌న్నడ హీరో కమ్ డైరెక్టర్ ఎంజీ శ్రీనివాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓల్డ్ మాంక్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ విడుదల చేశాడు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో అదితి ప్రభుదేవా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్ లో అశ్వరథంపై హీరోహీరోయిన్లు లుక్ చూస్తుంటే.. ఈ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కక‌ప్‌బోర్డు ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఆర్‌కే న‌ల్లమ్, ర‌వికాశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పునీత్ డబుల్ రోల్లో నటించిన యువరత్న సినిమా ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‏లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించగా.. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించాడు. విద్యా సంస్థలో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపడంతో పాటు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతున్నట్లుగా చూపించాడు డైరెక్టర్.

ట్వీట్..

Also Read: Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..