రెట్టింపు కామెడీ డోసుతో రానున్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో కలిసి నవ్వులు పంచనున్న అనుదీప్..

నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల ప్రేక్షకులను కడుపుబ్బ నటించిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా విడుదలకు ముందు ఫుల్ హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక విడుదల అనంతరం బాక్సాఫీసు

  • Rajitha Chanti
  • Publish Date - 10:40 pm, Thu, 8 April 21
రెట్టింపు కామెడీ డోసుతో రానున్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో కలిసి నవ్వులు పంచనున్న అనుదీప్..
Anudeep

నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల ప్రేక్షకులను కడుపుబ్బ నటించిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా విడుదలకు ముందు ఫుల్ హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక విడుదల అనంతరం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ డైరెక్టర్ జాతిరత్నాలు సినిమా కంటే రెట్టింపు కామెడీ డోసుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. జాతిరత్నాలు సినిమాలో జోగిపేట అనే ప్రాంతం నుంచి అనూహ్యంగా మర్డర్ కేసులో చిక్కుకుంటారు హీరో అతని మిత్రులు. ఈ స్టోరీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు అనుదీప్. ఇప్పుడు అతని తర్వాతి కథను కూడా ఇదే స్టైల్‌లో రాసుకుంటున్నాడట..కానీ.. ఇందులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే క్రమంలో పడే ఇబ్బందులను చూపించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి.. అధికారిక ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం అనుదీపు తన తర్వాతి చిత్రాన్ని ఎనర్జిటిక్ స్టార్ రామ్‏తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని కూడా వైజయంతి మూవీస్ సంస్థతో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా కూడా ‘జాతిరత్నాలు’ స్టైల్‌లోనే ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాక.. ‘జాతిరత్నాలు’ కంటే ఈ సినిమాలో కామెడీ రెట్టింపుగా ఉండనుందట.

Also Read: Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..

Puneeth Raj Kumar: ఓటీటీలోకి ‘యువరత్న’.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న మరో కన్నడ హీరో.. ‘ఓల్డ్ మాంగ్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సత్యదేవ్..