Sai Durgha Tej: కాలేయ సమస్యతో బాధపడుతోన్న అమ్మాయి.. గొప్ప మనసు చాటుకున్న మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. అదే సమయంలో మామయ్యల బాటలోనే పయనిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా లివర్ సమస్యతో బాధపడుతోన్న ఓ పాపకు తన వంతు సహాయం చేశాడీ మెగా హీరో

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ బాగా కష్టపడుతున్నాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడీ మెగా హీరో. సాయం కోరి వచ్చిన వారికి కూడా కాదన కుండా అండగా నిలుస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల తన కోసం సినిమా సెట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా భోజనం చేయించి మరీ కడుపు నింపాడు సాయి దుర్గ తేజ్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడీ మెగా హీరో. కాలేయ సమస్యతో బాధపడుతోన్న ఓ చిన్నారికి తన వంతు సాయం చేశాడు. అలాగే మరికొందరు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు సాయి దుర్గ తేజ్.
‘హయా అనే అమ్మాయి కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆ పాప జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. నా వంతుగా నేను ఆమె ట్రీట్‌మెంట్ కోసం సాయం చేశాను. దయచేసి మీరు కూడా ఎంతో కొంత డబ్బును ఇవ్వండి. ప్లీజ్ మీరు చేసే సాయం వల్ల ఆ పాప ప్రాణాలతో ఉంటుంది. ప్రతి డొనేషన్ చాలా ముఖ్యమైనది. ఆమె ఓ పోరాట యోధురాలు. మీరు సాయం చేయడం వల్ల ఆ పాప సమస్య నుంచి బయటపడుతుంది’ అని రాసుకొచ్చాడీ మెగా మేనల్లుడు.
సాయి దుర్గ తేజ్ ట్వీట్..
Iqra Haya is suffering from a liver condition and is undergoing treatment at Apollo Hospitals, Jubilee Hills, Hyd. I’ve contributed my best to support her treatment. Please contribute as much as you can to help save this child’s life. Every donation counts! Wishing her a speedy…
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 28, 2025
సాయి దుర్గ తేజ్ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందించి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉంటున్నాడు సాయి దుర్గ తేజ్. రోహిత్ కేపీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నట్లు సమాచారం.
సంబరాల ఏటి గట్టు మూవీ సెట్ లో భోజనాలు చేస్తున్న మెగాభిమానులు..
Mega Supreme Hero @IamSaiDharamTej Arranged Lunch to 350+ Fans Today at #SYG Sets.#SaiDharamTej pic.twitter.com/hf1vo4XPOX
— Praveen (@AlwaysPraveen7) January 23, 2025
సంబరాల ఏటి గట్టు సినిమా కోసం బాడీని బాగానే పెంచేశాడు సాయి ధరమ్ తేజ్. గతంలో మునుపెన్నడూ చూడని లుక్కులో మెగా హీరో కనిపించనున్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.
అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న సాయి దుర్గ తేజ్..
Mega Supreme Hero @IamSaiDharamTej Interaction With Fans Today at #SYG Sets pic.twitter.com/u7DN7Pyt2h
— Praveen (@AlwaysPraveen7) January 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.