Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన మెగా హీరో..
నిర్మాత బాపినీడు నిర్మిస్తోన్న ఈ మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో జయంత్ పానుగంటి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. బైక్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన ఈ హీరో..ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా తన 16వ సినిమాను షూరు చేశారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత బాపినీడు నిర్మిస్తోన్న ఈ మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో జయంత్ పానుగంటి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అయితే ఈ ట్వీట్ ను సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ.. ఓ యూజర్ కామెంట్ చేశారు. కొంచెం పేరు తెలిసిన దర్శకులను ఎంపిక చేసుకో అన్న.. అంటూ బ్రహ్మందం జిఫ్ ఇమేజ్ తో ట్రోల్ చేశాడు. అయితే నెటిజన్ కామెంట్ కు సాయి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు.
ఒకప్పుడు నా పేరు కూడా తెలీదు మీకు.. అతడి పే రు జయంత్. దయచేసి అతడి పేరు గుర్తుపెట్టుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు తేజూ. అయితే సాయి ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్.. స్టోరీ పై సాయి నమ్మకం ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోయిన్లు, టెక్నీషియన్లు తదితర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Okappudu na peru kuda telidhu meeku…his name is “Jayanth” please remember his name ? https://t.co/MHsfvGKI2u
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 2, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





