Like Share Subscribe: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అయితే విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదల అనంతరం మాత్రం నిరాశే కలిగించింది. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతుంది.

యంగ్ హీరో సంతోష్ శోభన్.. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ ను డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే విడుదలకు ముందే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. విడుదల అనంతరం మాత్రం నిరాశే కలిగించింది. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతుంది.
తాజాగా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిసెంబర్ 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ప్రముఖ డిజిటల్ పార్టనర్ సోనీ లివ్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో సంతోష్, ఫారియా ట్రావెల్ వ్లాగర్స్‌గా నటించారు.
ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల సంగీతం అందించారు. OTT ప్రేక్షకులు చెప్పిన తేదీ నుండి చిత్రాన్ని సోనీ లైవ్‌లో ప్రసారం చేయవచ్చు.
Get ready to watch the funniest and most thrilling journey of the Travel Vlogger Viplav from #LikeShareandSubscribe from 9th Dec on Sony LIV.#LSSonSonyLIV #SonyLIV @NiharikaEnt @GandhiMerlapaka @MerlapakaG@svr4446 @lightsmith83@NeerajaKona @santoshshobhan @fariaabdullah2 pic.twitter.com/tbwQRLlugp
— Sony LIV (@SonyLIV) December 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.