Animal Movie : యానిమల్ సినిమాలో నటించినందుకు క్షమాపణలు చెప్పిన రణబీర్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ భారీ విజయాన్ని అందుకుంది. అంతకు ముందు విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ హిట్ అయితే రణబీర్ కపూర్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా మాత్రం ‘యానిమల్’.

Animal Movie : యానిమల్ సినిమాలో నటించినందుకు క్షమాపణలు చెప్పిన రణబీర్
Animal
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2024 | 1:03 PM

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ భారీ విజయాన్ని అందుకుంది. అంతకు ముందు విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ హిట్ అయితే రణబీర్ కపూర్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా మాత్రం ‘యానిమల్’. యానిమల్ చిత్రం విడుదలైన తర్వాత అనేక విమర్శలు వచ్చాయి. కానీ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. రణబీర్ కపూర్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రణబీర్ కపూర్.. ‘యానిమల్’ సినిమాలో నటించిన తర్వాత నా బంధువులు, స్నేహితులు చాలా మంది ఈ సినిమాలో నేను నటించకూడదని, ఇది చెడ్డ సినిమా అని చెప్పారు. ‘సారీ, ఇక నుంచి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను, మంచి సినిమాలను ఎంచుకుంటాను, మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను’అని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలో నటించినందుకు ఏం బాధపడటంలేదు. ‘యానిమల్’ సినిమాలో నటించడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటి అని రణబీర్ కూడా ఇదే పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. అలాగైతే క్షమాపణ ఎందుకు చెప్పను అంటే.., ‘నేను ఇప్పుడు నా జీవితంలో ఒక దశకు చేరుకున్నాను, నేను ఎవరితోనూ వాదించను, క్షమాపణలు చెప్పి ముందుకు వెళ్తాను. నేను ఏమి చేయాలో, నాకు ఏమి అనిపిస్తుందో నేను చూసుకుంటాను.’

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

‘ఒకప్పుడు గొప్ప విజయాన్ని చూశాను. నెక్ట్స్ సూపర్ స్టార్ అని పిలిచేవారు, కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు, విమర్శలు, విమర్శలు, అవే పాత్రలు చేయడం చూశాను అన్నారు. అలాంటి సమయంలో నాకు యానిమల్ వచ్చింది. నేను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాను, అలాంటి సినిమా నాకు కావాలి, లవర్ బాయ్ నుండి మ్యాచో మ్యాన్‌గా మారడానికి ఇది ఉపయోగపడింది’ అని రణబీర్ కపూర్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!