AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence : ఆ విషయంలో అభిమానులకు లారెన్స్ విన్నపం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..

ఇటీవలే రుద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. ఏప్రిల్ 19న విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా అటు ఓటీటీలోకి రాబోతుంది. మే 12 లేదా 19న ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

Raghava Lawrence : ఆ విషయంలో అభిమానులకు లారెన్స్ విన్నపం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..
Raghava Lawrence
Rajitha Chanti
|

Updated on: Apr 30, 2023 | 4:40 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న రాఘవ.. ఇటు నటుడిగానే కాదు.. అటు కొరియోగ్రాఫర్‏గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో డాన్, స్టైల్ చిత్రాల్లో నటించిన ఆయన.. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రుద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. ఏప్రిల్ 19న విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా అటు ఓటీటీలోకి రాబోతుంది. మే 12 లేదా 19న ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ వేడుకలో రాఘవ మొత్తం 150 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరలయ్యింది. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన రాఘవ.. ఈ 150 మంది పిల్లలను అక్కున చేర్చుకుని చదువు భాద్యతలు తీసుకుంటున్నానని అన్నారు. అయితే ఆరోజు తాను ఈ పోస్ట్ పెట్టిన తర్వాత మరింత మంది వారి కష్టాలను తెలియజేస్తూ లారెన్స్ కు మెసేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సోషల్ మీడియా వేదికగా విన్నపం చేశారు.

ఇవి కూడా చదవండి

“అందరికీ నమస్కారం! విద్యను అందించడానికి 150 మంది పిల్లలను దత్తత తీసుకునే నా కొత్త ప్రాజెక్ట్. నేను ప్రకటించిన తర్వాత, నన్ను కలవడానికి నాకు చాలా రిక్వెస్ట్స్ వస్తున్నాను. నేను మిమ్మల్ని కలిసి మీ అభ్యర్థనలను ఖచ్చితంగా పరిశీలిస్తాను. నిజంగా సాయం ఎవరికి అవసరమో వారిని తప్పకుండా ఎంపిక చేసుకుంటాను. మీరు వచ్చి నన్ను అభ్యర్థించాల్సిన అవసరం లేదు.” అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు లారెన్స్. దీంతో ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.