L2 : Empuraan: ఎల్ 2 సినిమా వివాదంపై స్పందించిన పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.. నా కొడుకును బలి పశువును చేస్తున్నారంటూ ఆవేదన..
మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటేస్ట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై జనాలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు.

మలయాళంలో భారీ అంచనాల మధ్య విడుదలై వివాదాల్లో చిక్కుకున్న సినిమా ఎల్ 2: ఎంపురాన్. ఈ మూవీ కాంట్రవర్సీపై ఇప్పటికే మోహన్ లాల్ స్పందించి క్షమాపణలు చెప్పారు. మరోసారు సోషల్ మీడియాలో చిత్రయూనిట్ తరపున సారీ చెబుతూ ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. తాజాగా ఈ సినిమా డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా సుకుమారన్ సైతం ఈ వివాదం స్పందించారు. ఈ మూవీ విషయంలో తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని.. కానీ తన కొడుకును బలి పశువును చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. దీనిపై మొదట స్పందించకూడదని అనుకున్నానని.. కానీ తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో రియాక్ట్ అవుతున్నట్లు తెలిపారు.
మల్లికా సుకుమారన్ పోస్టులో.. “ఎల్ 2: ఎంపురాన్ సినిమా తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. నా కొడుకు పృథ్వీరాజ్ సుకుమారన్ ను అన్యాయంగా నిందిస్తున్నారు. అతడి గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాటిని చూసి ఓ తల్లిగా ఆవేదన చెందుతున్నాను. మోహన్ లాల్, చిత్రనిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు. మోహన్ లాల్ నాకు తమ్ముడితో సమానం. నా కొడుకును ఎన్నో సార్లు ప్రశంసించాడు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతడు ఎవరినీ మోసం చేయలేదు. ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుంది. అందురూ స్క్రిప్ట్ చదివి.. షూటింగ్ చేసినవాళ్లే. అందరూ ఒప్పుకున్న తర్వాతే సినిమాను రూపొందించారు. డైలాగ్స్ అవసరమైతే మార్పులు చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు ?
ఈ సినిమాలో మోహన్ లాల్ కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జత చేశారంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు. నా కొడుకు ఎప్పుడూ ఎవరి నమ్మకాలను వ్యతిరేకించలేదు. మోహన్ లాల్ సైతం ఈ సినిమా చూశారు. సినిమా కోసం నా కొడుకు ఎంతో కష్టపడ్డారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. మార్చి 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..