Nithiin: భార్య కోసం హీరో నితిన్ కీలక నిర్ణయం.. ఏకంగా రెండు నెలలు సినిమా షూటింగులకు బ్రేక్.. ఏమైందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్యన ఈ హ్యాండ్సమ్ హీరోకు సరైన హిట్టు పడలేదు. అందుకే ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో ‘రాబిన్ హుడ్’ అనే మూవీ చేస్తున్నాడు నితిన్. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్యన ఈ హ్యాండ్సమ్ హీరోకు సరైన హిట్టు పడలేదు. అందుకే ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో ‘రాబిన్ హుడ్’ అనే మూవీ చేస్తున్నాడు నితిన్. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా రాబిన్ హుడ్. అలాగే ఎక్స్ ట్రార్టినరి మ్యాన్ తర్వాత నితిన్ – శ్రీలీల మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో సీనియర్ నటి లయ కూడా ఒక కీలక పాత్ర పోషించనుందని సమచారం. ఇప్పటికే చాలా భాగం ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘తమ్ముడు’ అనే మూవీలో చేస్తున్నాడు. ఇందులో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం రెండు ఈ సినిమా షూటింగులు శర వేగంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే నితిన్ రెండు నెలల పాటు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ గా మారింది. తన భార్య షాలినీ కందుకూరి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడట ఈ హ్యాండ్సమ్ హీరో.
2020లో షాలిని కందుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నితిన్. తమ మూడు ముళ్ల బంధానికి ప్రతీకగా వీరి జీవితంలోకి ఒక పండంటి బిడ్డ అడుగు పెట్టనుందని సమాచారం. షాలినీ ప్రస్తుతం గర్భంతో ఉందని, త్వరలోనే డెలివరీ డేట్ కూడా ఉండడంతోనే సుమారు రెండు నెలలు షూటింగ్స్ కు నితిన్ విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కీలక సమయంలో తన భార్య వెన్నంటే ఉండాలనుకుంటున్నాడట ఈ హీరో. అందుకే షూటింగ్స్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చాడని సమాచారం.
భార్య షాలినీతో హీరో నితిన్..
View this post on Instagram
రాబిన్ హుడ్ ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అలాగే తమ్ముడు సినిమాను కూడా వీలైనంత వేగంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి నితిన్ నిర్ణయంతో ఈ రెండు సినిమాలు అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతాయా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఏదేమైనా రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.
నితిన్, షాలినీల రొమాంటిక్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








