AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! చిరంజీవి హీరోయిన్ ఏంటీ ఇంతమారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేరు గురూ..

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అమ్మబాబోయ్..! చిరంజీవి హీరోయిన్ ఏంటీ ఇంతమారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేరు గురూ..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2025 | 8:02 AM

Share

అందరివాడు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  2005లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి డ్యుయల్ రోల్‌లో నటించారు. టబు, రిమి సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన రిమి సేన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది.? ఎలా ఉందో.? ఒక్కసారి చూద్దాం..

హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రిమి సేన్.. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని కలలు కన్నది. అనుకున్నట్టుగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత కోల్‌కతా నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. రిమి సేన్ అసలు పేరు సుభమిత్ర సేన్‌. ‘పరోమితర్ ఏక్ దిన్’ అనే బెంగాలీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. ఆ తర్వాత తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ(2001) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత నీ తోడు కావాలి(2002), అందరివాడు(2005) తెలుగు చిత్రాలలో నటించింది. హిందీలో ధూమ్(2004), క్యోన్ కి(2005), గరం మసాలా(2005), గోల్‌మాల్(2006) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

2015లో బిగ్ బాస్, బిగ్ బ్రదర్ రియాల్టీ షోలలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే కెరీర్ తొలినాళ్లలో అమీర్ ఖాన్‌తో కోకో-కోలా యాడ్‌లో నటించింది రిమి సేన్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అందంతో కుర్రకారు మతిపోగొడుతోంది. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఏ మార్పు లేదు అంతే అందంగా అంతే గ్లామర్ గా అయింది ఈ అందాల భామ. మరి లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Rimi Sen (@subhamitra03)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..