AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Love Story: చెన్నై లవ్ స్టోరీ సూపర్ హిట్.. ఈ సినిమాను మిస్సైన హీరోహీరోయిన్లు ఎవరో తెలుసా.. ?

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన చిన్న చిన్న సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Chennai Love Story: చెన్నై లవ్ స్టోరీ సూపర్ హిట్.. ఈ సినిమాను మిస్సైన హీరోహీరోయిన్లు ఎవరో తెలుసా.. ?
Chennai Love Story
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2026 | 12:29 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఇప్పటికే బేబీ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రేజీ కాంబో డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన యూత్ ఫుల్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించింది. ఇందులో వీరిద్దరి జోడికి, కెమిస్ట్రీ, నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న జోడి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు వీరిద్దరు ఫస్ట్ చాయిస్ కాదట. అంతకు ముందు మరో హీరోహీరోయిన్ తో సినిమా చేయాలనుకున్నారట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. ?

ఈ సినిమాకు ముందుగా సూపర్ హిట్ బేబీ జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య వద్దకు వెళ్లిందట. అంతా ఫైనల్ అయ్యాక మేకర్స్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి . మరోసారి బేబీ రేంజ్ లో సూపర్ హిట్ కావడం అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి వీరిద్దరు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి కిరణ్, గౌరీ ఎంపిక అయ్యారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది.

ముఖ్యంగా కిరణ్ అబ్బవరం మరోసారి తన నటనతో యూత్ ను అలరించారని అంటున్నారు. బబీ సినిమా తర్వాత ఆనంద్, వైష్ణవి కాంబోలోఈ మూవీ వస్తుందని అంతా అనుకుంటే.. కిరణ్, గౌరీ కాంబో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us