87 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డ్ భయ్యో.. లిస్ట్‌లో ఒకే ఒక్క టీమిండియా ప్లేయర్.. పేరు తెలిస్తే షాకే..
Cricket Unbroken Record: భారతీయ దిగ్గజాలు భారత క్రికెట్ గోడ రాహుల్ ద్రవిడ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వంటి వారు కూడా గంభీర్ రికార్డును దాటలేకపోయారు. రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్.. వీరంతా వరుసగా 4 టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే సెంచరీలు చేయగలిగారు.

Team India: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలవుతున్నా, ఒక అద్భుతమైన రికార్డు మాత్రం గత 87 ఏళ్లుగా అలాగే నిలిచి ఉంది. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ నెలకొల్పిన ఈ రికార్డుకు సమీపంలోకి వచ్చిన ఏకైక భారతీయ క్రికెటర్ ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమే. సచిన్, ద్రవిడ్, గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు.
డాన్ బ్రాడ్‌మాన్ ఆల్-టైమ్ రికార్డు (1937-38) టెస్ట్ క్రికెట్‌లో వరుసగా 6 మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన ఘనత ఆస్ట్రేలియా బ్యాటింగ్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్‌కు మాత్రమే సొంతం. 1937 జనవరి 1న ఇంగ్లాండ్‌పై మొదలైన ఈ సెంచరీల ప్రవాహం, 1938 జులై 22 వరకు కొనసాగింది. ఈ 87 ఏళ్లలో మరే ఇతర బ్యాటర్ కూడా వరుసగా 6 మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయలేకపోయారు.
గౌతమ్ గంభీర్ అరుదైన ఘనత భారత్ తరపున ఈ రికార్డుకు అత్యంత సమీపంలోకి వచ్చిన ఒకే ఒక్కడు గౌతమ్ గంభీర్. 2009-2010 మధ్య కాలంలో గంభీర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుసగా 5 టెస్టు మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక జట్లపై ఈ ఘనత సాధించాడు.
అయితే, గంభీర్ ఆరో మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసి ఉంటే బ్రాడ్‌మాన్ రికార్డును సమం చేసేవాడు. కానీ, అది సాధ్యపడలేదు. ప్రపంచ వ్యాప్తంగా గంభీర్‌తో పాటు జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా), మొహమ్మద్ యూసుఫ్ (పాకిస్థాన్) కూడా వరుసగా 5 మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు.
ఇతర భారతీయ దిగ్గజాలు భారత క్రికెట్ గోడ రాహుల్ ద్రవిడ్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వంటి వారు కూడా గంభీర్ రికార్డును దాటలేకపోయారు.
రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్.. వీరంతా వరుసగా 4 టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే సెంచరీలు చేయగలిగారు.
ఈ గణాంకాలను బట్టి చూస్తే, గంభీర్ సాధించిన ఘనత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 87 ఏళ్ల బ్రాడ్‌మాన్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








