Shubman Gill : హమ్మయ్యా.. ఆకలితో ఉన్న సింహం వచ్చేసింది.. ఇక కటక్‌లో సౌతాఫ్రికాకు చుక్కలే
Shubman Gill : భారత టీ20 జట్టు వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్ డిసెంబర్ 9న కటక్‌లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు. గిల్ ఆదివారం రాత్రి 9 గంటలకు భువనేశ్వర్ చేరుకోవడంతో అతను తొలి టీ20 మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని స్పష్టమైంది.

Shubman Gill : భారత టీ20 జట్టు వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్ డిసెంబర్ 9న కటక్‌లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు. గిల్ ఆదివారం రాత్రి 9 గంటలకు భువనేశ్వర్ చేరుకోవడంతో అతను తొలి టీ20 మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని స్పష్టమైంది. సౌతాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో ఈ వార్త జట్టుకు పెద్ద బలాన్ని ఇవ్వనుంది.
కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా శుభ్‌మన్ గిల్‌కు మెడ పట్టేసిన సమస్య తలెత్తింది. ఈ గాయం కారణంగా గిల్ టెస్ట్, వన్డే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, ఫిట్‌గా ఉంటేనే ఆడటానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. గిల్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తన ఫిట్‌నెస్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అన్ని ఫిట్‌నెస్ ప్రమాణాలను గిల్ దాటగలిగాడు.
వైజాగ్ (విశాఖపట్నం) లో జరిగిన చివరి వన్డే తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గిల్ ఫిట్‌నెస్‌ను ధృవీకరించారు. “శుభ్‌మన్ ఫిట్ అయ్యాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాము. అతను ఆడటానికి మాత్రమే కాదు. పరుగులు చేయడానికి కూడా ఆకలితో ఉన్నాడు” అని గంభీర్ చెప్పారు.
శుభ్‌మన్ గిల్ ఆదివారం రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌కు చేరుకున్నప్పటికీ, వన్డే జట్టులో భాగమైన టీ20 ఆటగాళ్లు అంతకుముందే వైజాగ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా ఆదివారం ఉదయం భువనేశ్వర్ చేరుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే కటక్‌లో తమ సన్నాహకాలను మొదలుపెట్టారు. టీమిండియా జట్టులో అందరికంటే ముందుగా భువనేశ్వర్ చేరుకున్న ఆటగాళ్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడని స్థానిక మీడియా రిపోర్టులు తెలిపాయి.
నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యా ఆదివారం సాయంత్రం కటక్‌లోని బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే, పాండ్యా తన ప్రాక్టీస్‌ను క్లోజ్డ్ డోర్స్‌లో (ప్రేక్షకులను అనుమతించకుండా) నిర్వహించడం విశేషం. గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను తన ఫామ్, ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి ప్రత్యేకంగా ఈ ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




