AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: ఓటీటీలో కోర్టు సినిమా సంచలనం.. దర్శకుడికి కాస్ట్‏లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో నాని..

ప్రస్తుతం హిట్ 3 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో నాని. డైరెక్టర్ శేలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈసినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.. హిట్ సిరీస్‏లో భాగంగా వస్తున్న ఈ మూవీ నాని సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నారు నాని.

Actor Nani: ఓటీటీలో కోర్టు సినిమా సంచలనం.. దర్శకుడికి కాస్ట్‏లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో నాని..
Nani
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2025 | 7:03 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే అసిస్టెంట్ డైరెక్టర్‏గా సినీప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటి అబ్బాయి పాత్రలలో కనిపించిన నాని.. కొన్నాళ్లు మాస్ హీరోగా మెప్పించేందుకు ట్రై చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దసరా సినిమా మాస్ హీరోగా కనిపించిన నాని… ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రఫ్పాడించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం హిట్ 3 మూవీతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో అర్జు్న్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో నాని కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటు హీరోగానే కాకుండా అటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు.

తన నిర్మాణంలో ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను నిర్మిస్తూ విజయం సాధిస్తున్నారు. ఇటీవల నాని సొంత బ్యానర్ పై నిర్మించిన సినిమా కోర్టు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే రామ్ జగదీష్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాని. కోర్టు చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీల్లోనూ సత్తా చాటుతుంది. ఈ క్రమంలోనే కోర్టు సినిమా దర్శకుడికి ఖరీదైన కారును బహుమతిగా అందించారు నాని.

అయితే దర్శకుడికి కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని నాని ఎక్కడ బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో ఫోటోస్ సైతం షేర్ చేయలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోర్టు డైరెక్టర్ ఈ విషయాన్ని రివీల్ చేసాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా తీసుకోవడం పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఆనందంగా అందరికీ చెప్పుకోవాలని ఉందని.. కానీ గిఫ్ట్ ఇచ్చి ఇలా బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని అన్నారు. దీంతో ఇప్పుడు నానిపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..