Nani: ఇదేం మాస్ మావ.. విజయ్ పార్టీ విజయం గురించి నాని ఆసక్తికర ట్వీట్..
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ విజయం హాట్ టాపిక్‌గా మారిన వేళ, నటుడు నాని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అండర్‌డాగ్‌గా మొదలైన ప్రయాణం చివరకు విజయంలో ముగిసిందని పేర్కొంటూ విజయ్‌కు అభినందనలు తెలిపారు. తమిళనాడు ప్రజల తీర్పు స్పష్టమైందని, వారి కోసం మంచి జరుగాలని ఆశిస్తున్నానని నాని పేర్కొన్నారు.

తమిళనాట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది.. ఇక విజయ్ సీఎం పదవి చేపట్టడం లాంచనమే. అనూహ్య విజయం సాధించిన విజయ్‌కు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయ్ పార్టీ విజయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కథానాయకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌ను అభినందిస్తూ నాని “ముందు సందేహించారు.. తర్వాత కిరీటం పెట్టారు. మన ఇంట్లో జరిగినదే(పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి) ఇప్పుడు మన పొరుగు ఇంట్లో జరుగుతోంది” అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అండర్‌డాగ్‌గా భావించిన వ్యక్తి గెలవడం ఎప్పుడూ సినిమా లాంటి అనుభూతినిస్తుందని, అది రాజకీయాల్లోనూ అలాగే కనిపిస్తోందని అన్నారు.
అంతేకాదు, తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, వారి కోసం మంచి జరగాలని ఆశిస్తున్నానని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ విజయం, అలాగే అతనికి వస్తున్న మద్దతు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Congratulations @actorvijay sir.
First doubted and then crowned. Happened at our home and now it’s happening in our neighbouring home.
Underdog winning is always absolute cinema ( or should I say absolute politics ?) 🙂 Hope great things follow for the people of Tamil Nadu…
— Nani (@NameisNani) May 4, 2026
