AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK: కింగ్ మేకర్ కాదు.. కింగ్.. తమిళనాట విజయ్ సంచలనం.. టీవీకే అధినేత ఆస్తుల వివరాలివే

గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు హీరో విజయ్ దళపతి. సినిమాల్లో స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ చూసిన ఆయనకు రాజకీయాల్లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా అన్నిటినీ అధిగమించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళుతున్నారు.

Vijay TVK: కింగ్ మేకర్ కాదు.. కింగ్.. తమిళనాట విజయ్ సంచలనం.. టీవీకే అధినేత ఆస్తుల వివరాలివే
Tvk Vijay
Basha Shek
|

Updated on: May 04, 2026 | 1:12 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. గత కొన్ని దశబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తోన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కాదని విజయ్ టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లలో గెలవాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్​ ప్రకారం.. దళపతి విజయ్​ కి చెందిన టీవీకే పార్టీ 111+ సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే 60 సీట్లకే పరిమితమైంది. అన్నాడీఎంకే  కూడా 6ం+కు పైగా స్థానాల్లో లీడింగ్ తో రెండో స్థానంలో ఉంది.  ఇక విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలైన పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ లీడింగ్ లో ఉన్నారు టీవీకే అధినేత. కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయం. అలాగే విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కూడా లాంఛనమే. ఈ నేపథ్యంలో విజయ్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్​ సమయంలో టీవీకే విజయ్​ సమర్పించిన నామినేషన్ ప్రకారం.. ఆయనకు రూ. 404.58 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి. అలాగే విజయ్​ స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. భార్య సంగీతకు రూ. 15.51 కోట్ల చరాస్తులు (3,132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు), రూ. 2.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక విజయ్ వద్ద రూ. 2 లక్షలు, సంగీత వద్ద రూ. 1 లక్ష నగదు ఉంది. విజయ్ తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా అఫిడవిట్​లో వెల్లడించారు. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు. తల్లి శోభకు రూ. 87.12 లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక భార్య సంగీతకు రూ. 12.6 కోట్లు. కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు విజయ్.

కాగా గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు విజయ్. కానీ ఆయన రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. కరూర్ లో నిర్వహించిన సభలో ఏకంగా 40మందికి పైగా చనిపోయారు. ఈ ఘటన విషయంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, హీరోయిన్ త్రిషతో ప్రేమాయణం.. ఇలా ఇంటా బయటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విజయ్. అయినా అన్నిటినీ అధిగమించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కింగ్ గా అవతరించారు విజయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు.. ఇంటిలో కాసుల వర్షమే!
బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు.. ఇంటిలో కాసుల వర్షమే!
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..