AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango: మామిడి పండ్లను ప్రిజ్‌లో పెట్టి తినడం సేఫేనా.. నిపుణులు ఇచ్చే సలహా ఏంటి!

సమ్మర్ వచ్చిందంటే చాలూ ఈ సీజన్‌లో దొరికే మామిడి పండ్లు తినేందుకు జనాలు ఇష్టంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఎక్కడికైనా తోటలకు వెళ్లినప్పుడు బల్క్‌గా మామిడి పండ్లను తెచ్చుకొని తింటారు. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడానికి వాటిని ప్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. కానీ ఈ పండ్లను ప్రిజ్‌లో పెట్టవచ్చా.. వీటిని స్టోర్ చేయడం గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

Mango: మామిడి పండ్లను ప్రిజ్‌లో పెట్టి తినడం సేఫేనా.. నిపుణులు ఇచ్చే సలహా ఏంటి!
How To Keep Mangoes Fresh
Anand T
|

Updated on: May 24, 2026 | 10:24 AM

Share

వేసవిలో దొరికే మామిడి పండ్లను తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. ఎందుకంటే ఇవి టేస్ట్‌తో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిని నేరుగా తినడమే కాదు.. వీటిలో వంటకాలు, జ్యూస్‌లు కూడా చేసుకుంటారు. అయితే ఎక్కడికైనా తోటలకు వెల్లినప్పుడు చాలా మంది బల్క్‌గా ఒకేసా పెద్దమొత్తంలో పండ్లను తెచ్చుకొని ప్రిజ్‌లో స్టోర్ చేసుకొని తింటారు. మరికొందరు నార్మల్‌గా గది ఉష్ణోగ్రత వద్దనే ఒక బుట్టలో స్టోర్ చేసుకొని తింటారు.అయితే ఇక్కడ చాలా మందిలో వచ్చే డౌట్ ఏమిటంటే.. మామిడి పండ్లను ప్రిజ్‌లో ఉంచవచ్చా లేదా అని.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?

మీరు తోట నుంచి తెచ్చిన మామి పండ్లు పూర్తి పండకపోతే వాటిని అస్సలూ ప్రిజ్‌లో ఉంచకండి. పచ్చిగా లేదా సగం పండిన మామిడి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం వల్లనే అవి త్వరగా పండుతాయి. అలాగే వాటి రుచిలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. అయితే, పూర్తిగా పండిన తర్వాత, వాటిని ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. పండిన మామిడి పండ్లు 4-5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అయితే, వాటిని మరీ చల్లటి ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల పండు రుచితో పాటు ఆకృతిలో స్వల్ప మార్పులు రావచ్చు, కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే పండ్లను ఫ్రిజ్‌లో పెట్టండి.

పండ్లు పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి

పేపర్‌లో చుట్టి పెట్టడం : మామిడి పండు పచ్చిగా ఉండి, దాన్ని త్వరగా పండించాలి అనుకుంటే.. వాటికి న్యూస్ పేపర్ చేట్టి ఒక సంచిలో స్టోర్ చేయండి. ఇలా చేయడం ద్వారా పండు త్వరగా, సమానంగా పండుతుంది.

పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి – మామిడి పండ్లను ఎల్లప్పుడూ ఎండపడే ప్రదేశంలో ఉంచకూడదు. అధిక వేడి వల్ల అవి త్వరగా పాడవుతాయి. మామిడి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద లేదా గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

కోసిన మామిడి పండ్లను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి – మీరు తినేందుకు ఒక పండును కట్‌చేస్తే.. అది మిగిలిపోతే దాన్ని బయట ఉంచకుండా.. ప్రిజ్‌లో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల వాటి రుచి, తాజాదనం పాడవకుండా ఉంటాయి . అలాగే త్వరగా ఎండిపోకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us