కుంకుమ పువ్వు కలిపిన వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

Samatha

13June 2026

కుంకుమ పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా చాలా ఖరీదు అయినది కూడా, అందుకే చాలా మంది దీనిని కొనుగోలు చేసినా జాగ్రత్తగా దాచుకుంటారు.

కుంకుమ పువ్వు

ఇక కొంత మంది కుంకుమ పువ్వు నీరు ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగుతుంటారు. మరి ఇలా కుంకుమ పువ్వు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

కుంకుమ పువ్వు నీరు

అసలు ఈ కుంకుమ పువ్వు కలిపిన నీటిని ఎవరు తాగకూడదు, వీటిని ఎలాంటి సమస్యలు ఉన్నవారు తాగడం వలన ఇబ్బందులు ఎదురు అవుతాయో చూద్దాం.

ఎవరు తాగకూడదు

చాలా మంది గర్భిణీలు కుంకుమపువ్వు తినడం వలన పిల్లలు తెల్లగా పుడతారని దీనిని తీసుకుంటారు కానీ ఇది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంట.

గర్భిణీలు

కుంకుమ పువ్వును లో బీపీ సమస్య ఉన్నవారు అస్సలే తీసుకోకూడదు. దీని వలన బీపీ మరింత పడిపోయే ఛాన్స్ ఉన్నదంట.

లో బీపీ ఉన్నవారు

అంతే కాకుండా రక్తస్రావం సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు దీనికి ఎంత దూరం ఉంటే, అంత మంచిదంట.

రక్తస్రావం

అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా కుంకుమ పువ్వు కలిపిన నీరు అతిగా తీసుకోకూడదు, ఇది సమస్యను మరింత పెంచుతుంది.

అలర్జీ ఉన్నవారు

ముఖ్యంగా గర్భిణీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

గర్భిణీలు