AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు.. పెద్ది వివాదంపై అనంత శ్రీరామ్ రియాక్షన్..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ పై మరోవైపు కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Peddi Movie: బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు.. పెద్ది వివాదంపై అనంత శ్రీరామ్ రియాక్షన్..
Anantha Sriram, Buchi Babu
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2026 | 6:41 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. స్పోర్ట్స్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, బాడీ మేకోవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు జాన్వీ కపూర్ పాత్ర పై పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. అలాగే జాన్వీ పాత్రకు సంబంధించి వస్తున్న నెగిటివ్ విమర్శల నేపథ్యంలో పలు సీన్స్ సైతం సినిమా నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఆదివారం చిత్రయూనిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ జాన్వీ పాత్ర పై వచ్చిన విమర్శలకు బుచ్చిబాబు సారీ చెప్పడం తనకు నచ్చలేదని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు. ఒక పాత్రను ఎలా తీయాలి ? ఆ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది దర్శకుడి ఊహ. ఇంగ్లీష్ బాగా వచ్చి పీహెచ్డీ పట్టభద్రులైనవారు మాట్లాడిందే నిజమని ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా మాట్లాడేవాళ్ల అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంతో వారంతా ప్రభావితమయ్యారు. దర్శకుడికి ఈ మాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎలా ? ప్రతి పాత్రను ఇలా విమర్శించుకుంటూ పోతే దర్శకుల సృజనాత్మకతను తొక్కేసినట్లే. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన సారీ చెప్పడం నాకైతే నచ్చలేదు. ఇలాగే చేస్తుంటే భవిష్యత్తులో కేవలం డాక్యుమెంటరీలు తప్ప కమర్షియల్ సినిమాలు రావు. స్పెషల్ సాంగ్ అంటే పాటలాగే చూడాలి” అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ… “ఒక అయిదు శాతం మంది మాత్రమే అలా మాట్లాడారు. మిగతా వాళ్లంతా సినిమా గురించి.. చరణ్ యాక్టింగ్ గురించే మాట్లాడారు. అలా మాట్లాడేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఉప్పెనలో బేబమ్మ పాత్రను అందరూ పొగిడారు. కానీ అంత గొప్ప క్యారెక్టర్ రాసిన ఆ దర్శకుడే అచ్చియమ్మ పాత్ర గురించి రాసాడు. ఆ పాత్ర రెబలిష్. ఆ నైట్ సీన్ తర్వాత సున్నితం అయిపోయిచివర్ల్లో తండ్రికి ప్రేమించినా మొగుడే అని చెప్పి ఆ పాత్రకు రౌండాఫ్ ఇచ్చాం. మధ్యలో కొన్ని సీన్స్ మిస్ కావడం వల్ల అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరిన్ని సీన్స్ జతచేశాము” అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

Follow Us