రోజూ ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే ఏమవుతుంది..!
Krishna
14 June 2026
ఒక గుడ్డులో సుమారు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది గుడ్డులోని పచ్చసొన లోనే కేంద్రీకృతమై ఉంటుంది. మన శరీరానికి ఒక రోజుకు అవసరమైన కొలెస్ట్రాల్‌లో అధిక భాగం ఒక్క గుడ్డు నుంచే లభిస్తుంది.
కొలెస్ట్రాల్
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువైతే, అది రక్తనాళాలలో పేరుకుపోయి గుండెకు రక్త ప్రసరణ జరగకుండా ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో అధిక రక్తపోటు, గుండెపోటు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
గుండె ఆరోగ్యం
గుడ్లలో కార్బోహైడ్రేట్లు లేదా ఫైబర్ అస్సలు ఉండవు. ఫైబర్ లేని ఈ ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి చాలా మందిలో మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
జీర్ణ సమస్యలు
గుడ్లలోని ప్రోటీన్ శరీరంలో జీర్ణమైనప్పుడు నైట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. నైట్రోజన్ స్థాయిలు పెరిగితే రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీలు ఎక్కువ కష్టపడాలి. కిడ్నీల వ్యాధితో బాధపడేవారికి వారికి ఇది మంచిది కాదు.
కిడ్నీలపై ఎఫెక్ట్
వివిధ వ్యక్తుల శారీరక పరిస్థితిని బట్టి గుడ్లు తినే పరిమాణం మారుతుంది. సాధారణ ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లను పచ్చసొనతో సహా ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా తినవచ్చు
ఎన్ని తినొచ్చు
రోజూ హెవీ వర్కౌట్స్ చేసేవారు లేదా క్రీడాకారులు రోజుకు 3 నుండి 5 గుడ్ల వరకు తినొచ్చు. అయితే కేవలం ఒకే ఒక్క గుడ్డును పచ్చసొనతో తిని, మిగిలిన 4 గుడ్లను కేవలం తెల్లసొన మాత్రమే తినాలి.
జిమ్‌కి వెళ్లేవారు
జిమ్‌కి వెళ్లే కొందరు పచ్చి గుడ్లను నేరుగా పాలతో కలిపి తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
పచ్చి గుడ్లు
గుడ్లను ఆయిల్ లేదా వెన్నలో వేసి డీప్ ఫ్రై చేయడం కంటే నీళ్లలో ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం. ఎక్కువ నూనె వాడటం వల్ల గుడ్డులోని మేలు చేసే గుణాలు పోయి, శరీరంలో కొవ్వు రెట్టింపు అవుతుంది.