Kamal Haasan: భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు సిద్ధమైన కమల్ హాసన్.. ఆ స్టార్ హీరోలెవరంటే..
విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటికీ ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. వరుస చిత్రాలతో యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నాడు.

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటికీ ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. వరుస చిత్రాలతో యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు. తన సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మిచేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కమల్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. పలు కారణాల వలన వాయిదా పడిన ఈ సినిమా వచ్చే నెల నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా కమల్ ఇద్దరూ స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. తమిళ్ స్టార్స్ విక్రమ్.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో భారీ మల్టీస్టారర్ నిర్మించనున్నారట. ఈ సినిమాను ఓ ప్రముఖ దర్శకుడు తెరెకెక్కించబోతున్నారట. ఇందులో కమల్ కూడా నటించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట. ఇక ప్రస్తుతం కమల్ నటిస్తున్న విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్తో స్టెప్పులేయనున్న సమంత…
Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..
Prakash Raj: మౌనం వహించనున్న ప్రకాష్ రాజ్.. అందుకోసమే అంటూ ట్వీట్.