Prakash Raj: మౌనం వహించనున్న ప్రకాష్ రాజ్.. అందుకోసమే అంటూ ట్వీట్..
విలక్షణ నటుడిగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రకాష్ రాజ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్గా..
విలక్షణ నటుడిగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రకాష్ రాజ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్గా.. తండ్రిగా..అన్నయ్యగా.. తాతాగా ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రకాష్ రాజ్. తమిళ్, కన్నడ, తెలుగులో వందలకుపైగా చిత్రాల్లో నటించిన ప్రకాష్ రాజ్.. ఇటీవల మా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో స్పందించాడు.
గత కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్.. షూటింగ్ సమయంలో గయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేతికి గాయాలు కాగా..ఆ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నట్లుగా తెలిపారు. ఇక సర్జరీ పూర్తైన విషయంతో పాటు.. డిశ్చార్జ్ అయిన కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తున్నారు. తాజాగా మరోసారి తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ” డాక్టర్ల వద్ద నేను పూర్తి చెకప్ చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను. కానీ నా గొంతుకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం. నేను ఈ వారం రోజులు మౌనవ్రతం పాటిస్తాను..” అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.
ట్వీట్..
Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss
— Prakash Raj (@prakashraaj) November 15, 2021
Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..
Trisha: ఎమోషనల్ ట్వీట్ చేసిన త్రిష.. గుండె బద్దలైందంటున్న హీరోయిన్..