Trisha: ఎమోషనల్ ట్వీట్ చేసిన త్రిష.. గుండె బద్దలైందంటున్న హీరోయిన్..
తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలో అగ్రకథనాయికలుగా కొనసాగినవారిలో త్రిష ఒకరు. తన అందం..అభినయం
తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలో అగ్రకథనాయికలుగా కొనసాగినవారిలో త్రిష ఒకరు. తన అందం..అభినయం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష.. స్టా్ర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సుధీర్ఘకాలం టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది. అయితే కొంత కాలంగా త్రిష టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెట్టింది. అక్కడే వరుస సినిమాలను చేస్తూ…తనేంటో నిరూపించుకుంటుంది. ఇటీవల తిరిగి తెలుగులోనూ ఆఫర్లు అందుకుంటూ రీఎంట్రీకి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే త్రిష.. తాజాగా తన గుండె బద్దలైందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇటీవల త్రిష వీరాభిమాని కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విట్టర్ ఖాతాను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రామించాడట. అలాగే త్రిష అభిమానులందరినీ ఒక్కచోటికి తీసుకువచ్చాడంట. అలాంటి వ్యక్తి చనిపోవడంతో త్రిష అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న త్రిష కూడా కంటతడి పెట్టుకుంది. నా గుండె బద్దలైంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను బ్రదర్ అంటూ ఎమోషనల్ ట్విట్ చేసింది త్రిష. ఇక త్రిష 96 సినిమాతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. సక్సెస్ అందుకుంది.
I am so devastated about this? Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco
— Trish (@trishtrashers) November 14, 2021
Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..
Samantha: వరుస ఆఫర్లలతో సమంత బిజీ బిజీ.. రాజమౌళి సినిమాలో హీరోయిన్గా సామ్ ?..
Suriya Jai Bheem: వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..