Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధే శ్యామ్. డైరెక్టర్ రాధకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్

Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..
Radheshyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 15, 2021 | 6:24 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధే శ్యామ్. డైరెక్టర్ రాధకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గరపడుతున్నా.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధేశ్యామ్ నుంచి చిన్న అప్డేట్ అయిన ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు. ఓ అభిమాని ఏకంగా అప్డేట్ ఇవ్వాలంటూ మూవీ యూనిట్ కు సూసైడ్ లేక కూడా రాశాడు. దీంతో ఎట్టకేలకు రాధేశ్యామ్ చిత్రయూనిట్ దిగివచ్చింది.

ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఈ రాతలే పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాధేశ్యా్మ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే డార్లింగ్ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. చిత్రయూనిట్ ప్రకటించిన సమయం ముగింగి గంట కావోస్తున్న ఇప్పటివరకు రాధేశ్యామ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయలేదు. అసలు ఎందుకు విడుదల చేయలేదు అనే విషయాన్ని కూడా చిత్రయూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థతోపాటు.. దర్శకుడిని సైతం బండ బూతులు తిడుతున్నారు. నిద్రపోతున్నావా ?.. కారణం చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అప్డేట్ ఇస్తామంటూ డార్లింగ్ అభిమానులకు ఆశ చూపిన యూవీ క్రియేషన్స్.. చివరి నిమిషంలో వాళ్ల ఆశలపై నీళ్లు జల్లింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంటి విడుదలైన పోస్టర్స్, టీజర్ యూట్యూబ్‏లో నయా రికార్డ్స్ సృష్టించాయి.

Also Read: Prakash Raj: మౌనం వహించనున్న ప్రకాష్ రాజ్.. అందుకోసమే అంటూ ట్వీట్.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో చరిత్ర సృష్టించిన సబ్ ఇన్‏స్పెక్టర్.. తొలి విజేత ఎవరంటే..

Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..