సొంత‌గా క్ష‌వ‌రం..చివ‌రికి గుండే శ‌ర‌ణ్యం

కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో షూటింగులు క్యాన్సిల్ అవ్వ‌డంతో సెల‌బ్రిటీలు అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబంతో విలు‌వైన స‌మ‌యం గ‌డుపుతూ సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి హెయిర్ క‌ట్ మెయిన్ ప్రాబ్లంగా మారింది.

సొంత‌గా క్ష‌వ‌రం..చివ‌రికి గుండే శ‌ర‌ణ్యం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 06, 2020 | 9:02 AM

కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో షూటింగులు క్యాన్సిల్ అవ్వ‌డంతో సెల‌బ్రిటీలు అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబంతో విలు‌వైన స‌మ‌యం గ‌డుపుతూ సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి హెయిర్ క‌ట్ మెయిన్ ప్రాబ్లంగా మారింది. గ‌వ‌ర్న‌మెంట్ బార్బ‌ర్ షాపుల‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికి..వైర‌స్ భ‌యంతో అక్క‌డికి వెళ్లేందుకు జంకుతున్నారు. కొంద‌రి న‌టుల స‌తీమ‌ణులే..త‌మ భ‌ర్త‌ల కోసం బార్బ‌ర్లుగా మారుతున్నారు. మరికొంద‌రు త‌మ‌కు తామే హెయిర్ క‌ట్ చేసుకుంటున్నారు. ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న‌దే. తాజాగా ఇంట్లోనే ఉన్న బాలీవుడ్​ నటుడు జితేంద్ర కుమార్.. సొంతంగా క్షౌరం చేసుకున్నాడు. ఇప్పుడు ఇది కామన్..క‌దా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం ఏంటి అంటారా? ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. కటింగ్ చేసుకునే క్రమంలో తన జుట్టును ఒక ప‌ద్ద‌తి అంటూ లేకుండా కత్తిరించేసుకున్నాడు ఈ న‌టుడు. దీంతో జుట్టు పూర్తిగా ట్రిమ్​ చేసేయాల్సి వచ్చింది. ఈ విషయమే చెబుతూ, తన న‌యా హెయిర్​స్టైల్​తో ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

View this post on Instagram

When self hair-cut goes wrong? #quarantinelook #newlook

A post shared by Jitendra Kumar (@jitendrak1) on

‘శుభ్​మంగళ్ జ్యాదా సావధాన్’, ‘చమన్ బాహర్’ చిత్రాలు, ‘పంచాయత్’ లాంటి వెబ్​సిరీస్​తో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జితేంద్ర కుమార్. ప్రస్తుతం ‘పంచాయత్’ రెండో సీజన్​లో న‌టిస్తున్నాడు.